Site icon NTV Telugu

Somu Veerraju: దేవాలయాలు, వాటి ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం ఎందుకు..?

Somu Veerraju

Somu Veerraju

ఇతర మతాల ప్రార్ధనా మందిరాలపై, ఆస్తులపై లేని ప్రభుత్వ పెత్తనం..! హిందూ దేవాలయాలు, వాటికి సంబంధించిన ఆస్తుల పైనే ఎందుకు..? అంటూ ప్రశ్నించారు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం మాత్రమే ఉన్న హిందూ దేవాలయాలు అన్నింటినీ ఆయా ఆలయాల అర్చకులకే అప్పగించాలని… ఆ దేవాలయాల పాలన బాధ్యతల నుంచి దేవాదాయ శాఖ తప్పుకోవాలంటూ.. తాను విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Read Also: Chintamaneni Prabhakar: మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి ఊరట.. ఆ కేసు కొట్టివేత..

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు సోము వీర్రాజు.. ఈ తీర్పుతో కొన్ని గుళ్లల్లోనైనా.. ఆచార, వ్యవహారాలకు, సంప్రదాయాలకూ పూర్వపు మహర్దశ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.. ఇతర మతాల ప్రార్ధనా మందిరాలపై, ఆస్తులపై లేని ప్రభుత్వ పెత్తనం ! హిందూ దేవాలయాలు, ఆస్తుల పైనే ఎందుకు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ అంశంపై బీజేపీ వాదనకు బలం కలిగేలా వచ్చిన ఈ తీర్పు భవిష్యత్తులో అన్ని ఆలయాల విముక్తికి నాంది కావాలని ఆకాక్షించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.

Exit mobile version