NTV Telugu Site icon

Somu Veerraju: అధికారంలోకి వస్తే 10వేల కోట్లతో అమరావతి అభివృద్ధి

Somu Veerraju On Jp Nadda

Somu Veerraju On Jp Nadda

ఏపీలో వైసీపీ వర్సెస్ బీజేపీ వ్యవహారం నడుస్తోంది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఏర్పాటు చేసిన బీజేపీ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ పై మండిపడ్డారు. క్యాపిటల్ మీద రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అభిప్రాయం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల భూములను ప్రభుత్వం అమ్మేసుకోవడం దారుణం.వారి భూములను వారికి అందచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ ను అభివృద్ధి చేయాలి.

ముఖ్యమంత్రి అసలు సెక్రటేరియట్ కు వెళ్లకుండా ఇంటి నుండే పరిపాలన చేయడం సరికాదు. బీజేపీ ప్రత్నామ్నాయా పార్టీగా ఎందుకు మారకూడదు. బీజేపీ అధికారంలోకి వస్తే 10వేల కోట్లతో క్యాపిటల్ ను 3ఏళ్లలో నిర్మాణం చేస్తుంది. ప్రభుత్వం రైతుల దగ్గర నుండి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనే పద్ధతిని మేము రద్దు చేసి FCI ల ద్వారా కొనుగోలు చేస్తాం. పేదలకు కేంద్రం ద్వారా మసూరి బియ్యం అందచేస్తాం. ఇల్లు కట్టించి ఇచ్చే స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. గత ప్రభుత్వం మొదలుపెట్టిన టిడ్కో ఇల్లు ఇంతవరకు లబ్ధిదారులకు ఇచ్చే పరిస్థితి లేదు. మోడీ ప్రభుత్వం మాత్రమే ఈ రాష్ట్రానికి ప్రత్నామ్నాయం అన్నారు.
Maharashtra Politics : రెబల్‌ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట..