Site icon NTV Telugu

Somu Veerraju: సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ..

Somu And Jagan

Somu And Jagan

Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు మరో లేఖ రాశారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. అగ్రి గోల్డ్ బాధితుల సమస్య పరిష్కారంపై తన లేఖలో పేర్కొన్నారు.. అగ్రి గోల్డు బాధితుల పరిష్కారంపై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.. అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లో అగ్రిగోల్డు బాధితుల సమస్యలను న్యాయస్థానాల పరిధి నుండి దాటి పరిష్కరిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే, అధికారం వచ్చి మూడున్నరేళ్లు దాటినా ఎందుకు పరిష్కరించలేదు? అని ప్రశ్నించారు. అగ్రి గోల్డు సంస్ధ మదుపు చేసిన కష్టమర్లకు సకాలంలో నగదు చెల్లింపు చేయక పోవడంతో 142 మంది మృతి చెందారని ఆరోపించారు.. ఆనాడు అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి మూడు లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తానంటే.. ఆనాడు మీరు (వైఎస్‌ జగన్‌) 10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తానని చెప్పారని లేఖలో గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క నయా పైసా అయినా ఎక్స్ గ్రేషియా చెల్లించారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: RC15: రామ్ చరణ్- శంకర్ టైటిల్ భలే గమ్మత్తుగా ఉందే..?

రూ. 10 వేలులోపు పరిధి ఉన్న బాండ్లుకు 2019 సంవత్సరంలో రూ. 250 కోట్లు, 2021 ఆగస్టులో రూ. 667 కోట్లు మేరకు మాత్రమే బాండ్లు పరిష్కారం జరిగింది.. అయితే ఆ తర్వాత ఒక్కరికి కూడా బాండ్లు పరిష్కారం కాలేదు అన్నారు సోము వీర్రాజు.. అగ్రి గోల్డు బాధితులు సుమారు 14 లక్షల మంది తమ బాండ్లకు ఎప్పుడు నగదు పరిష్కారం జరుగుతుంది అని ఎదురుచూస్తున్నారు.. విచిత్రమేమంటే అగ్రిగోల్డు సంస్ధ నడుపుతున్న ఇతర సంస్ధలు యధావిధిగా నడుస్తున్నాయి.. వాటి జోలికి ప్రభుత్వం వెళ్లడం లేదని ఆరోపించారు. మరో వైపు అగ్రిగోల్డులో నగదు మదుపు చేసి బాండ్లు తీసుకున్న వారి సమస్యలపై మీ ప్రభుత్వం నోరుమెదపడం లేదు? ఎందుకు? అని లేఖలో నిలదీశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.

Exit mobile version