NTV Telugu Site icon

Somu Veerraju : మసిపూసి మారేడు కాయ చేసే బడ్జెట్

ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మండిపడ్డారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. రాష్ట్ర బడ్జెట్ చూస్తుంటే అప్పులు చేసి పథకాలకు పంచేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటట్లు ఉందన్నారు. ఏ ప్రాంతం అభివృద్ధి కోసం బడ్జెట్ లో ప్రస్తావన లేదు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టు లకు ఎందుకు నిధులు కేటాయించలేదు.

మసిపూసి మారేడు కాయ చేసే బడ్జెట్ ఇది. ఏ ప్రాంతాన్ని ఆలోచింపచేసే బడ్జెట్ కాదు ఇది. బడ్జెట్ ను చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తుంది. పెయిడ్ ప్రభుత్వ వ్యవస్థ ఏపీలో త్వరలో తీసుకు వస్తాం. మాకు శక్తి కేంద్రాలు ఉన్నాయి…ఈ ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్ధ ఉంది. పంజాబ్ లో మేము మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయలేదు. వచ్చే ఎన్నికల్లో పంజాబ్ లో బీజేపీ గెలుస్తుంది. స్పెషల్ స్టేటస్ కన్న మనమే ఎక్కువ సాధించాం..అని అప్పట్లో చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ లోటు 5వేల కోట్లు అంచనా ఉండగా నేడు 5వేల కోట్లకు చేరింది.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అప్పులతోనే పాలన సాగిస్తుంది. అప్పుల వివరాలు ఎన్నిసార్లు అడుగుతున్నా స్పందించడం లేదు. అప్పులు వివరాలు ప్రజల ముందు పెట్టాలి. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ ప్లాన్ ఎక్కడా అమలు చేయడం లేదు. పెండింగ్ ప్రాజెక్టులకు వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించలేదన్నారు సోము వీర్రాజు. ఈ బడ్జెట్ లో రాజమండ్రి, కాకినాడ పేరు ఉందా? మరే జిల్లా పేరైనా ఉందా?కేంద్ర బడ్జెట్ లో ఏపీ రాష్ట్రం ప్రస్తావన ఏదని అడిగిన జగన్ ఇక్కడ ఏ ప్రాంతం ప్రస్తావన ఎందుకు చూపలేదని ప్రశ్నించారు సోము వీర్రాజు. కేంద్ర బడ్జెట్ లో అందరికి నిధులు ఇచ్చాం. నరేంద్ర మోడీ కేంద్రంలో 64వేల కోట్లతో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పులు పెట్టిన జగన్ ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్టు. అప్పులు ఎగ్గొట్టడానికా? ఏపీలో బీజేపీ జెండా ఎగరేస్తాం. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి సముచిత స్థానం ఇచ్చాం. రైల్వే జోన్ కు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని త్వరలోనే సాధ్యం చేస్తాం అన్నారు.