NTV Telugu Site icon

Somu Veerraju: ద్వారంపూడిపై చర్యలకు గవర్నర్ కి లేఖ

Somu1

Somu1

ఏపీలో బీజేపీ-వైసీపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. ముస్లింలను రెచ్చగొడుతూ బీజేపీ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలకి స్పీకర్ అతనిని సస్పెండ్ చేయాలన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. దీనిపై గవర్నర్ కి లేఖ ద్వారా ఫిర్యాదు చేశాం అన్నారు. పోలవరం,ఉత్తరాంధ్ర జిలాల్లో ప్రాజెక్టులు కడుతున్నాము. బీజేపీకి మాత్రమే వైసీపీ ప్రభుత్వం భయపడుతుంది.

జెఎన్టీయుకె ఆస్థులు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం. పోలీసులు బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారు. శ్రీశైలంలో ఎమ్మెల్యే చక్రపాణి అనుచరుడు రజాక్ రాజ్యం నడుస్తుంది. వైసీపీ ప్రభుత్వం..హిందూ వ్యతిరేక ప్రభుత్వం. టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టకుండా నిలువరించాం. కాల్వల ఆధునికీకరణ పనులకు ఉద్యమం చేస్తామన్నారు.

కాకినాడ జెఎన్ టి యూ సమీపంలో మసీదు స్థలం కోర్టు పరిధి లో ఉంది. ఆ స్థలం కోసం కాకినాడ నగర ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. ఆ స్థలం గత ముప్పై సవంత్సరాల నుండి కోర్టు పరిధిలోనే ఉంది. పోలవరం తప్ప ఉత్తరాంధ్ర , రాయలసీమ లో ఒక్క ప్రాజెక్ కి పనులు ప్రారంభించలేదు. అక్రమ రేషన్ బియ్యం ఎగుమతులపై రీసైక్లింగ్ చేస్తున్న రైస్ మిల్లలర్లను అరెస్ట్ చేస్తాము. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మిల్లర్లపై చర్యలు తీసుకుంటాము.కర్నూల్ కి చెందిన ఎస్ బి పి ఈ సంస్థ పాకిస్థాన్ జిందాబాద్ అని అంటున్నారు. పూర్తి ఆధారాలతో కర్నూల్ ఎస్పీ కి ఫిర్యాదు చేసాము. మేమే నిజమైన ప్రతిపక్షం.. పోరాటం చేసి సాధిస్తున్నాం.

పోలీసులతోను వాలంటరీలతోనూ వైసీపీ నాయకులు గడప గడప కు వైసీపీ కార్యక్రమం చేస్తున్నారన్నారు సోము వీర్రాజు. మరోవైపు మాజీమంత్రి, బీజేపీ నేత రావెల కిషోర్ బాబు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రావెల కిషోర్ పేరుతో పార్టీ అధ్యక్షుడికి లేఖ రాశారు. ప్రస్తుతం రావెల అజ్ఞాతంలో వున్నారు. స్విచ్ఛాఫ్ లో ఫోన్ వుంది.