Site icon NTV Telugu

Somu Veerraju : దుష్టశక్తులు భారీ కుట్ర పన్నాయి..

Somu Veerraju

Somu Veerraju

నేడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని.. భీమవరంలో జిల్లాలో ఏర్పాటు చేసిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన మోడీ అనంతరం హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్లకు బయలు దేరారు. అయితే ఈనేపథ్యంలో కొందరు నిరసన తెలుపుతూ.. డజన్ల కొద్దీ నల్ల ఎయిర్‌ బెలూన్‌లను గాల్లోకి వదిలారు. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ బిల్డింగ్ మీద నుంచి బెలూన్లు కాంగ్రెస్ నేతలు వదిలారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ నేతృత్వంలో బెలూన్లు యువకులు వదిలినట్లు తెలుస్తోంది. ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మ శ్రీ నిరసన తెలుపేందుకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్ పోర్టు సమీపంలో నిరసన తెలిపే ప్రయత్నం చేసిన ఎమ్మార్పీఎస్ నేతలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరో వైపు రాజమండ్రిలో పీసీసీ చీఫ్ శైలజానాధ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అయితే.. ఎయిర్‌బెలూన్‌లు వదలడంపై ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు మాట్లాడుతూ.. గన్నవరం విమానాశ్రయం సమీప ప్రాంతం ప్రధాని పర్యటిస్తోంటే కొన్ని దుష్ట శక్తులు ప్రమాదకర బెలూన్లు ఎగరవేశారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు నల్ల బెలూన్లు ఎగరవేయడం ద్వారా “భారీ కుట్రకు” పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి దోషుల పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ సంఘటన వెనుక సూత్రధారులు పాత్రధారులు కుట్ర అమలు చేసిన దుష్టశ్తులను వెంటనే గుర్తించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

Exit mobile version