NTV Telugu Site icon

Somireddy Chandramohan Reddy: సోమిరెడ్డిని 3 గంటలు విచారించిన సీబీఐ.. అంతా కాకాని పుణ్యమేనన్న మాజీమంత్రి

Somireddy Cbi Interrogation

Somireddy Cbi Interrogation

Somireddy Chandramohan Reddy Fires On Kakani Govardhan Reddy After CBI Interrogation: నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్స్ చోరీ అయిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్న సీబీఐ అధికారులు.. తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డిని మూడు గంటల పాటు విచారించారు. ఇదివరకే ఆయన్ను ఈ కేసులో నెల్లూరు జిల్లా కార్యాయలంలో విచారించగా, తాజాగా మళ్లీ ప్రశ్నించారు. ఈసారి న్యాయవాదితో పాటు విచారణకు హాజరైన సోమిరెడ్డి.. ఈ సందర్భంగా ఆయన పెన్ డ్రైవ్‌తో పాటు తొమ్మిది డాక్యుమెంట్లను అధికారులకు అందించారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ సూచించింది. మరో వారంలో పిలుస్తామని, లిఖితపూర్వకంగా సమాధానాలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Married Woman Molested: రుణం ఇప్పిస్తానన్నాడు.. బైక్ ఎక్కగానే షాకిచ్చాడు

సీబీఐ విచారణ ముగిసిన అనంతరం మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ.. మరోసారి తనని సీబీఐ అధికారులు విచారించారని తెలిపారు. పెన్ డ్రైవ్‌తో పాటు తొమ్మిది డాక్యుమెంట్లను అందించానన్నారు. కాకానికి గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన డాక్యుమెంట్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇచ్చానన్నారు. కాకాని పుణ్యమా అని.. తనకు సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యే అవకాశం కలిగిందని సెటైర్ వేశారు. మరో వారంలో మళ్లీ పిలుస్తామని, లిఖితపూర్వకంగా సమాధానాలను తీసుకుంటామని అధికారులు చెప్పారన్నారు. గతంలో చంద్రమోహన్ రెడ్డి మీద సీబీఐ, ఈడీల వద్దకు వెళ్తానని కాకాని చెప్పారని.. ఇప్పుడు సీబీఐ తన మీద కేసు పెట్టిందని అన్నారు. కాకాని ఎప్పుడూ నిజం చెప్పడని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. ఈ కేసులో కాకాని పాపం తప్పకుండా పండుతుందని ఉద్ఘాటించారు. పరునష్టం దావాకు సంబంధించి తాను వేసిన రెండు కేసులు త్వరలోనే విచారణకు వస్తాయని.. ఆయన చేసిన మోసాలకు దేవుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు.

America: భారీ సాంకేతిక లోపం.. అమెరికా అంతటా నిలిచిన విమానాలు

కోర్టులో జరిగిన దొంగతనం కేసు కూడా చాలా కీలకంగా మారుతుందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. కోర్టులో ఒక రాజకీయ వేత్త దొంగతనం చేయించడం సంచలనంగా మారిందన్నారు. రాజకీయ ప్రత్యర్థైన తన మీద తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని.. కాకాని రూపొందించిన డాక్యుమెంట్లకు సంబంధించిన పెన్ డ్రైవ్‌ను సీఎం జగన్‌కి కూడా పంపిస్తానని అన్నారు. దాన్ని చూసి, కాకానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తాను కోరుతున్నానన్నారు. తాను పెట్టిన మూడు కేసుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు ఇంత దిగజారి కుటుంబాలను నాశనం చేసేందుకు తప్పుడు పత్రాలు విడుదల చేయకుండా చూస్తామని సవాల్ విసిరారు.

Show comments