జిల్లా పేరు మార్పు వ్యవహారంలో కోనసీమ జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. జిల్లా కేంద్రమైన అమలాపురం అట్టుడికిపోయింది.. విధ్వంసానికి దారితీసింది.. అయితే, ఈ ఘటనపై ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతూనే ఉన్నా.. ప్రస్తుతం మాత్రం అమలాపురంలో ప్రశాంత వాతావరణం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.. అయితే, కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.. సెక్షన్ 144, పోలీసు యాక్ట్ 30 అమలులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని హెచ్చరించారు.
Read Also: Chandrababu: నేడు ఒంగోలుకు టీడీపీ అధినేత.. విజయవాడ నుంచి బైక్ ర్యాలీ
ఇక, మంగళవారం మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు ఇప్పుపెట్టడం, బస్సులను తగలబెట్టడం వంటి విధ్వంసం కొనసాగగా.. బుధవారం రోజు రవాణా వ్యవస్థ, షాపులు మొత్తం బంద్ చేశారు.. అయితే, ఇవాళ యథావిథిగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపిస్తున్నారు.. మరోవైపు, విధ్వంస చర్యలకు పాల్పడినవారిని గుర్తిస్తూ అరెస్ట్‌లు చేస్తున్నారు పోలీసులు.. రాత్రి నుండి పలువురు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ, జిల్లాలో ఇప్పటి వరకు ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించలేదు అధికారులు.. అన్ని నెట్వర్క్ లకు సంబంధించిన ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే కాగా.. పరిస్థితులు చక్కబడే వరకు నో ఇంటర్నెట్ సేవలు అంటున్నారు పోలీసు అధికారులు.