Chandrababu Nellore Sabha: చంద్రబాబు సభలో అపశృతి.. మృతులకు 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seven Members Died In Chandrababu Naidu Sabha In Nellore: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరులో తన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో అపశృతి నెలకొంది. పామూరు రోడ్‌లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆయన ప్రసంగిస్తున్న సమయంలో.. సభలో గందరగోళం, తొక్కిసలాట చోటు చేసుకున్నాయి. భారీగా జనం తరలిరావడం వల్లే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు కాలువలో పడి మృతి చెందగా.. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే కందుకూరి ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే చంద్రబాబు తన సభను మధ్యలోనే ఆపేసి, ఆసుపత్రికి వెళ్లారు. బాధితుల్ని పరామర్శించారు. మృతి చెందిన వారిని దేవినేని రవింద్ర (ఆత్మకూరు), కలవకురి యనాది (కొండమూడుసుపాలెం), యటగిరి విజయ (ఉలవపాడు), కకుమాను రాజా (కందుకూరు), మరలపాటి చిన కొండయ్య (గుళ్లపాలెం), పురుషోత్తం (కందుకూరు)గా గుర్తించారు.
Minister Roja: పవన్‌ని చూస్తే వొడాఫోన్ యాడ్ గుర్తుకొస్తుంది.. రోజా సెటైర్లు
ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొందరు నిండు ప్రాణాలు త్యాగం చేశారని చెబుతూ, తన సభను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని, కొన్ని సందర్భాల్లో మనం నిమిత్తమాత్రులం అవుతామని, విధిరాత ఇలా ఉందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. వారికి పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. కందుకూరుకి ఎప్పుడు వచ్చినా.. ఆసుపత్రి సెంటర్లోనే సభ పెడుతుంటామని, కానీ ఈసారి దురదృష్టకర ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సభను కొనసాగించడం భావ్యం కాదన్నారు. దీన్ని సంతాప సభగా భావించి, మృతుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి, సభను అర్థాంతరంగా ముగించారు.
Also Read
Jagan – Bhupendra Yadav: కేంద్రమంత్రి భూపేంద్రతో భేటీలో జగన్ ప్రస్తావించిన అంశాలివే
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!