Minister Lokesh: వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచి స్కూల్ యూనిఫామ్ మార్పుకు శ్రీకారం చుట్టింది. కొత్త యూనిఫామ్లకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారు. ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా ఈ యూనిఫాం రూపొందించాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లో భాగంగా స్టూడెంట్లకు యూనిఫామ్, బ్యాగు, బెల్ట్ ను ప్రభుత్వం అందించనుంది. ఇక, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇచ్చే యూనిఫాం, స్కూల్ బ్యాగ్, బెల్టులను అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రదర్శించారు.
Read Also: PM Modi: ప్రధాని మోడీకి మారిషన్ అత్యున్నత పురస్కారం.. 21 అంతర్జాతీయ పురస్కారం..
ఇక, గత ప్రభుత్వ హయాంలో విద్యారంగం దారుణంగా దెబ్బతినింది అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యార్థులకు ఇచ్చే పుస్తకాల్లో బొమ్మలు వేసుకునేందుకు జగన్ ప్రభుత్వం 9 పేజీలు కేటాయించింది.. దీని కోసమే రూ. 30 లక్షల రూపాయలు వెచ్చించారు.. విద్యార్ధులు రాసుకునే వర్క్ పుస్తకంపై కూడా జగన్ బొమ్మలు వేసుకున్నారు అని ఆయన ఆరోపిచారు. స్కూల్ బ్యాగు, బెల్టు, గుడ్లపైనా స్టాంపులు వేసుకున్న పరిస్థితి గతంలో ఉంది.. ప్రస్తుతం వాటన్నిటీని తొలగించాం.. తద్వారా విద్యార్ధుల కిట్లపైనే రూ.300 కోట్ల రూపాయలకు పైగా ఆదా అయ్యాయని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఫోటోల పిచ్చిలేదు, రాజకీయ నాయకుల ఫోటోలను విద్యార్థులపై రుద్దకూడదన్నది మా నిర్ణయం అని నారా లోకేష్ వెల్లడించారు.
Read Also: US-Ukraine Peace Talks: సౌదీ వేదికగా అమెరికా-ఉక్రెయిన్ శాంతి చర్చలు..
కాగా, యూనిఫాం సహా చిక్కీలు, గుడ్లు ఇలా వివిధ సరఫరా దారులకు రూ.352 కోట్ల బకాయిలను గత ప్రభుత్వం పెట్టిందని మంంత్రి లోకేష్ తెలిపారు. బైజూస్ కోసమని ట్యాబ్స్ ఇచ్చారు.. వాటిని చాలా మంది తల్లితండ్రులు వద్దని చెప్పారు.. ప్రతీ పిల్లవాడికీ సాంకేతికత అవసరమే అందుకే కంప్యూటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16.6 శాతం అడ్మిషన్లు పెరిగాయి.. రాష్ట్రంలోని యూని వర్సిటీలకు అసలు ర్యాంకింగే లేకుండా పోయాయి.. కేజీ నుంచి పీజీ వరకూ వ్యవస్థీకృత విధానం ఉండాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం.. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్ధుల ఆత్మహత్యలు జరక్కూడదనే సర్కార్ ప్రయత్నిస్తోంది అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.