NTV Telugu Site icon

VandeBharat: సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు.. టైమింగ్స్ ఇవే.. స్పీడ్ ఇంత తక్కువా?

Vandebharat

Vandebharat

VandeBharat: ఏపీ, తెలంగాణ మధ్య మరో కొత్త రైలు అందుబాటులోకి రానుంది. ఈనెల 19న ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించబోతున్నారు. ఈ రైలు సికింద్రాబాద్-విశాఖ మధ్య పరుగులు పెట్టనుంది. అయితే సాధారణంగా వందేభారత్ రైలు స్పీడ్ గంటకు 180 కి.మీ.తో వెళ్లాల్సి ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రైలు కేవలం 82.58 కి.మీ. స్పీడ్‌తోనే నడవనుంది. దీనికి కారణం రైల్వే ట్రాక్ అని అధికారులు చెప్తున్నారు. ఇంకా సరైన రీతిలో ట్రాక్ సిద్ధం కాకపోవడంతో వందేభారత్ తక్కువ వేగంతో ప్రయాణించనుంది. ఈ రైలు సికింద్రాబాద్, విశాఖ మధ్య కేవలం నాలుగు స్టేషన్‌లలోనే ఆగనుంది.

Read Also: Chiru Balayya: ఇంకా ఓపెన్ అవ్వని బుకింగ్స్.. ఆందోళనలో ఫ్యాన్స్

సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరనున్న ఈ రైలు వరంగల్, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ స్టేషన్‌లలో మాత్రమే ఆగుతుంది. రాత్రి 11:15 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో విశాఖలో ఉదయం 5:45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. ప్రయాణ సమయం 8:30 గంటలుగా ఉంది. దురంతో రైలుతో పోలిస్తే గంటన్నర ప్రయాణ సమయం ఆదా కానుంది. ఇతర రైళ్లతో పోలిస్తే మూడు గంటలు వేగంగా వందేభారత్ సికింద్రాబాద్ నుంచి విశాఖ చేరుతుంది. ప్రస్తుతం దురంతో రైలు 10:10 గంటలు, గరీబ్ రథ్ 11:10 గంటలు, ఫలక్ నుమా 11:25 గంటలు, గోదావరి 12:05 గంటలు, ఈస్ట్ కోస్ట్ 12:40 గంటలు, జన్మభూమి 12:45 గంటల ప్రయాణ సమయం పడుతోంది.