Chandrababu: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి ఇవాళ ( మంగళవారం ) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఇటీవల న్యాయ విద్యార్థి కె.సాయి ఫణీంద్ర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సాయి ఫణీంద్ర చికిత్స కోసం తగిన సాయం చేయాలని కోరగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి 10 లక్షల రూపాయల సహాయం అందించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పి. భారతి ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు.
Read Also: Fungus in Beer Bottle: బీర్ బాటిల్‌లో ఫంగస్.. వైన్ షాప్ ముందు కస్టమర్ ఆందోళన!
సీఎం చంద్రబాబు మానవతా దృక్పథం చూపించారంటూ సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే పి. భారతీ కొనియాడారు. నిరంతరం పేద ప్రజల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేస్తారు.. వారి అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధి్కి తగిన కృషి చేస్తారని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసకరమైన పాలన కొనసాగింది.. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంది.. ప్రజల కోసం చంద్రబాబు పని చేసే వ్యక్తి అంటు మాజీ ఎమ్మెల్యే పి. భారతీ కొనియాడారు.