Sankranti Festival: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి.. రంగవల్లులు, డూడూ బసవన్నల విన్యాసాలు..

  • ఎన్టీవీ వీక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు..
  • తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి..
  • ఇళ్ల ముంగిట రంగుల రంగవల్లులు..
  • పల్లెల్లో డూడూ బసవన్నల విన్యాసాలు..
  • హరిదాసుల కీర్తనలతో కళకళలాడుతున్న పల్లెలు..
Sankranthi

Sankranthi

Sankranti Festival: తెలుగు రాష్ట్రాల్లో జరపుకునే అతి పెద్ద పండుగగా పేరొందిన సంక్రాంతి పండుగను ప్రజలు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ఘడియలతో భోగభాగ్యాలు కలుగుతాయని హిందువులు విశ్వసిస్తున్నారు. ఈ కారణంగానే సంక్రాంతికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది.

Read Also: Vishwambhara : ‘విశ్వంభర’‌పై కీలక నిర్ణయం తీసుకున్న చిరు..

×
×
Ad

పంటలు కోసి ఇంటికి చేరే సమయం కావడంతో సంక్రాంతి రైతుల పండుగగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటల ఫలితాన్ని ఆనందంగా ఆస్వాదించే పండుగగా సంక్రాంతిని జరుపుకుంటారు. ప్రకృతి, వ్యవసాయం, సూర్యుడికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే ఈ పండుగ. గ్రామాల్లో రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు పండుగ సందడిని మరింత పెంచేసింది. హరిదాసుల కీర్తనలు, భజనలు గ్రామాల వీధుల్లో మార్మోగుతున్నాయి. పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ సంబరాల్లో మునిగిపోతున్నారు.

Read Also: Aishwarya Rai : ఆరాధ్యకు ఫోన్ లేదు.. ఐశ్వర్య రాయ్ కఠిన నిబంధనలు! అభిషేక్ బచ్చన్ షాకింగ్ రివీల్.

ఇక, ఇళ్లల్లో అరిసెలు, సకినాలు, బూరెలు, పాయసం లాంటి సంప్రదాయ పిండి వంటకాలతో ఇళ్లు సువాసనలతో నిండిపోతున్నాయి. పెద్దలు-చిన్నలు అన్న తేడా లేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవడమే సంక్రాంతి పండగ ప్రత్యేకత. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ ఎన్టీవీ తెలుగు మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తుంది.