Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: పవన్‌పై సజ్జల సెటైర్లు.. ఆ నాల్గో ఆప్షన్‌ కూడా చెప్పాలింది..!

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: ఎన్నికల పొత్తులపై ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అప్పుడే చర్చ హాట్‌ హాట్‌గా సాగుతోంది.. ప్రస్తుతం బీజేపీతోనే ఉన్నానన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. బీజేపీ కాదంటే వేరే వాళ్లతో పొత్తులు ఉంటాయని.. అది కూడా కుదరకపోతే ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించారు.. అయితే, పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. పొత్తుల గురించి పవన్ కల్యాణ్‌ చెప్పిన మూడు ఆప్షన్స్ వింటే నవ్వొస్తుందన్న ఆయన.. షరతులు లేకుండా చంద్రబాబుకి సపోర్టు చెయ్యడం అనే నాలుగో ఆప్షన్ కూడా చెప్పాల్సింది అంటూ సెటైర్లు వేశారు.. గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా పవన్ రిమోట్ చంద్రబాబు చేతుల్లోనే ఉంటుందని విమర్శించారు.. లోకేష్ పాదయాత్రను టీడీపీ ఎక్కువగా ఊహించుకుంటోందన్న ఆయన.. లోకేష్, పవన్ కల్యాణ్‌, చంద్రబాబులలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రజలకు చెప్పండి అంటూ డిమాండ్‌ చేశారు.. వైసీపీ అంటే వైఎస్‌ జగన్.. జగన్ అంటే వైసీపీ.. మేము స్పష్టంగా ఉన్నామని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి..

Read Also: Sharwanand: ఘనంగా శర్వానంద్ నిశ్చితార్థం.. రామ్‌చరణ్ దంపతులు హాజరు

ఇక, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం అని పవన్ కల్యాణ్‌ ఏ ఆధారాలతో అంటున్నాడు? అని మండిపడ్డారు సజ్జల.. గెస్ట్ ఆర్టిస్ట్ లా వచ్చి చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తాడు అని ఎద్దేవా చేశారు.. రాజకీయంగా ఎస్సీ , ఎస్టీలకు వైఎస్‌ జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు.. చంద్రబాబు హయాంలో డొల్ల కాబట్టే ప్రచారం ఎక్కువ చేసుకున్నారు అంటూ సెటైర్లు వేశారు.. ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు? లోకేషా? చంద్రబాబా? పవన్ కళ్యాణా? అని ముందు మీరు ఒక క్లారిటీతో రండి అని హితవుపలికారు.. ఇక, మాకు ఎటువంటి గందరగోళం లేదు, అస్పష్టత లేదు.. వైసీపీలో సీఎం అంటే వైఎస్ జగన్ ఒక్కరే అని స్పష్టం చేశారు.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒంటరిగా 175 సీట్లకు పోటీ చేయగలరా? అని ప్రశ్నించిన ఆయన.. విడివిడిగా వచ్చినా, కలిసి వచ్చినా మాకు ఓకే.. పోని చెరిసగం అధికారంలో ఉంటామని చెప్పమనండి అని డిమాండ్‌ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Exit mobile version