NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: అధికారం కోసం పొత్తులు పెట్టుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడు

Sajjala On Cbn

Sajjala On Cbn

Sajjala Ramakrishna Reddy On Chandrababu Naidu Political Alliances: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలయికపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పందించారు. అధికారం కోసం పొత్తులు పెట్టుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడని విమర్శించారు. చంద్రబాబు చేస్తోంది మోసమని ఆరోపించారు. పొత్తుల విషయంలో తమకు స్పష్టమైన విధానం ఉందని.. కూటములు, పొత్తులకు సిద్ధాంతాలు ఉండాలని అన్నారు. 2014లో జనసేన, బీజేపీ కలిసి చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టాయని.. తర్వాత అదే చంద్రబాబు వాళ్లపై ఆరోపణలు వేసి, బయటకు వచ్చాడని వ్యాఖ్యానించారు.

Wives Eloped With Lovers: భర్తల్ని పని కోసం విదేశాలకు పంపి.. లవర్లతో భార్యలు జంప్

జగన్‌కు ప్రజల్లో ఆదరణ లేదని చెప్తున్న చంద్రబాబు.. ఇప్పుడు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? అని సజ్జల ప్రశ్నించారు. జగన్‌కు ప్రజల్లో 80 శాతం మద్దతు ఉందని.. వచ్చే ఎన్నికల్లో తమకు సీట్లతో పాటు ఓట్లు కూడా గణనీయంగా పెరుగుతాయని ధీమా వ్యక్తం చేసింది. వైసీపీకి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఆయన.. ఏపీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తమకు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే కీలకమని తేల్చి చెప్పారు. మరోసారి జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్న విషయం.. అన్నీ సర్వేల్లోనూ తేలుతోందని చెప్పారు. తమకు చంద్రబాబులా పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. ఒంటరిగా పోటీ చేసి, గత ఎన్నికల్లో కంటే గొప్ప విజయాన్ని నమోదు చేస్తామని నమ్మకంగా చెప్పారు.

Tillu Square: అప్పుడు నేహా.. ఇప్పుడు అనుపమ.. ముద్దు మాత్రం సిద్దుకే

అంతకుముందు కూడా.. చంద్రబాబు మాటలు పగటి కలల్లా ఉంటాయని సజ్జల ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడని, టీడీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ పొగిడారని.. చంద్రబాబు తనకు తానే అనుకోవడం విచిత్రంగా ఉందని అన్నారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఆరోపించారు. జగన్ ఢిల్లీ వెళితే తాటాకులు కడతారని.. మరి ఇప్పుడు చంద్రబాబు గురించి ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. ఏపీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ గెస్ట్ ఆర్టిస్టులే అని దుయ్యబట్టారు.

Show comments