Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: మా పై ఆంక్షలు పెట్టినా చెప్పలేదు.. మేం అప్పుడు రాద్దాంతం చేయలేదు..

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు హయాంలో డొల్ల కాబట్టే ప్రచారం ఎక్కువ చేసుకున్నారు అంటూ సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు? లోకేషా? చంద్రబాబా? పవన్ కళ్యాణా? అని ముందు మీరు ఒక క్లారిటీతో రండి అని హితవుపలికారు.. ఇక, మాకు ఎటువంటి గందరగోళం లేదు, అస్పష్టత లేదు.. వైసీపీలో సీఎం అంటే వైఎస్ జగన్ ఒక్కరే అని స్పష్టం చేశారు.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒంటరిగా 175 సీట్లకు పోటీ చేయగలరా? అని ప్రశ్నించిన ఆయన.. విడివిడిగా వచ్చినా, కలిసి వచ్చినా మాకు ఓకే.. పోని చెరిసగం అధికారంలో ఉంటామని చెప్పమనండి అని డిమాండ్‌ చేశారు..

Read Also: Republic Day 2023: దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు

మరోవైపు.. ఓదార్పు యాత్రలో చేసిన సహాయం గురించి వైఎస్ జగన్ ఇప్పటికీ బయట పెట్టలేదన్నారు సజ్జల.. మా పై ఆంక్షలు పెట్టినా బయటకి వచ్చి మేం చెప్పలేదన్న ఆయన.. పోలీసుల సూచనలు అమలు చేశాం.. కానీ, మేం అపుడు రాద్దాంతం చేయలేదన్నారు.. 2014లో ఛాన్స్ ఇచ్చినప్పుడు చంద్రబాబు అయిదేళ్లల్లో ఏం చేశారో చెప్పమనండి? అని ప్రశ్నించారు.. వితండ వాదానికి ఏం సమాధానం ఉంటుంది? అని ఎద్దేవా చేశారు.. ఇక, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులపై స్పందించిన ఆయన.. ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంలో బీజేపీలో ఉ‌న్న టీడీపీ స్లీపర్ సెల్స్ పని చేస్తున్నాయని ఆరోపించారు.. కానీ, అవినాష్ రెడ్డి.. సీబీఐకి పూర్తిగా సహకారిస్తారని అని వెల్లడించారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Exit mobile version