NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు ప్రజలు ఓటు బ్యాంకు మాత్రమే.. ఓట్ల కోసం వైసీపీ చౌకబారు ఎత్తుగడలు వేయదు..!

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

ఆకాశం నుంచి నాయకులు ఊడిపడరు.. నాయకులు ప్రజల్లోంచే వస్తారు.. .ఆ వాతావరణాన్ని వైఎస్‌ జగన్‌ సృష్టించారని తెలిపారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… వృత్తి లేకుండా బ్రతకలేమనే భావన చాలా మందిలో ఉంది… ఆ ఆలోచన మారాలని సూచించిన ఆయన.. ఈ ప్రభుత్వం ఏ పథకం పెట్టినా… వెనుకబడిన తరగతుల ఉన్నతి కోసమేనని స్పష్టం చేశారు.. గత ప్రభుత్వంలో విదేశీ విద్యలో స్కామ్‌లు జరిగాయని ఆరోపించిన సజ్జల.. అసలు వెళ్లారో లేదో తెలియకుండానే విదేశీ విద్య పేరుతో స్కామ్ చేశారు.. చాలా మంది పిల్లలు విదేశాలకు వెళ్లి చిక్కుకుపోయి చాలా తిప్పలు పడ్డారని.. ఇలాంటి సమస్య రాకూడదనేదే సీఎం జగన్ ఆలోచన.. అందుకే ఉన్నతమైన, నాణ్యమైన విద్య అందిస్తున్నారు.. భవిష్యత్‌లో కచ్చితంగా మన పిల్లలకు హార్వర్డ్ వంటి యూనివర్శిటీల్లో స్థానం దక్కుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Read Also: Tammineni Veerabhadram: కామ్రేడ్స్‌ రివర్స్‌ గేర్‌..! కేటీఆర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన తమ్మినేని..

అయితే, చంద్రబాబు ఆలోచనలు వేరేగా ఉంటాయి.. ఆయనకు ప్రజలు ఓటు బ్యాంకు మాత్రమే.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఓట్ల కోసం చౌకబారు ఎత్తుగడలు వేయదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.. నిజంగా అర్హత కలిగిన కుటుంబాలు చిరునవ్వుతో ఉండాలనేదే జగన్ లక్ష్యమన్న ఆయన.. నిరుపేదల బతుకులు బాగుపడేందుకే పథకాలు తీసుకొస్తున్నాం అన్నారు.. ఈ సమాజాన్ని ముందడుగు వేసేలా చేసే లీడర్ వైఎస్ జగన్.. ఆయనకు అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Show comments