NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: అభ్యర్థుల మార్పు.. నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తాం.. ఇమడలేని వారు వెళ్లిపోతారు..!

Sajjala

Sajjala

ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ సీపీ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను మార్చుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన సమీక్షలో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఇక సీఎం జగన్‌ సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తరచు జరిగే సమీక్షలే చేశామని, తమ ప్రభుత్వం చేసిన, చేయబోయే కార్యక్రమాల గురించి చర్చించామన్నారు.

Also Read: JC Prabhakar Reddy: పోలీసులకి ఖాకీ డ్రెస్సులు ఎందుకు..? వాళ్లను చూస్తే సిగ్గేస్తుంది..!

అలాగే జనవరిలో జరిగే అంబేద్కర్ ఆవిష్కరణ, మూడు వేల పెన్షన్ల పై చర్చించామని చెప్పారు. అదేవిధంగా గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఇచ్చిన హమీల్లో అమలు చేసిన పూర్తి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే వంటి అంశాలపై కూడా చర్చించామన్నారు. అలాగే రీజనల్ కోఆర్డినేటర్ల నేతృత్వంలో అభ్యర్థుల మార్పు వంటి అంశాలను కూడా చర్చించామన్నారు. పార్టీలో రకరకాల వ్యక్తులు ఉంటారని, వైసీపీ చాలా బలోపేతంగా ఉందన్నారు. నచ్చ చెప్పటానికి ప్రయత్నిస్తామని, అయినా ఇమడ లేకపోయిన వాళ్ళు వెళ్ళిపోతారన్నారు.

Also Reddy: Bigg Boss Telugu : ఇకపై అవి రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు..?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు కూడా మా పార్టీలోకి ఇంకా బలమైన వాళ్ళు వస్తారు అనుకున్నామన్నారు. అయితే ఏ పార్టీలోనైనా అసంతృప్తులు సహజమన్న ఆయన తమ పార్టీ మంచి ఫామ్‌లో ఉందన్నారు. అందుకే పోటీ చేయటానికి నాయకులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారని తెలిపారు. అయితే, అసంతృప్తుల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎందుకంటే అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అని అందరు అనుకుంటారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే జనవరిలో విజయవాడలో భారీ అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరించబోతున్నామని, అంబేద్కర్‌ ఆశయ సాధనలో వైసీపీ ఎప్పుడూ ముందు వరుసలో ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.