Site icon NTV Telugu

మాకెందుకు..? రాజీనామా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇష్టం..

Sajjala

Sajjala

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రాజీనామాల వ్యవహారం తెరపైకి వచ్చింది.. రాజీనామాలు చేసేందుకు మేం సిద్ధం.. వైసీపీ ఎంపీలు సిద్ధమా? అంటూ టీడీపీ ఎంపీలు సవాల్‌ చేస్తున్నారు.. దీనిపై సెటైర్లు వేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… చంద్రబాబు, తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటే ఎవరు అడ్డుకుంటారు..? మమ్మల్ని అడగటం ఎందుకు ? అని ప్రశ్నించారు సజ్జల.. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేసినప్పుడు టీడీపీ వాళ్ళను అడిగామా? అని నిలదీసిన ఆయన.. ఇక, టీడీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారులు, కన్సలటెంట్ల ఎంత మంది ఉండేవారో లెక్కలు తీస్తున్నాం.. ఆ రోజు పరకాల, కుటుంబ రావు లాంటి వారు రాజకీయాలు మాట్లాడినప్పుడు తప్పుగా ఎందుకు కనిపించ లేదని మండిపడ్డారు.

మరోవైపు అమరావతి అనేది పెద్ద స్కామ్‌గా పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆ స్కామ్‌లో ఎవరెవరు ఉన్నారో అందరికీ తెలిసిన విషయాలేనన్న ఆయన… ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ లేదని సాంకేతిక అంశాలతోనే కోర్టులో తీర్పు వచ్చిందని.. ఇన్ సైడ్ ట్రేడింగ్ అనే పదం ఉపయోగించటం సాంకేతికంగా ఇబ్బంది అయితే మరో కోణంలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.. తప్పు చేసిన వాళ్ళు కచ్చితంగా బయటపడతారు.. తప్పించుకోలేరని హెచ్చరించారు.

Exit mobile version