అమలాపురంలో జరిగిన విధ్వంసం వెనుక కచ్చితంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, వాళ్ల నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఉంది అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అమలాపురం ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఆందోళనలు, విధ్వంసంలో కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నట్లు ఉంది.. జరిగిన సంఘటన తీరు, ప్రతిపక్ష నాయకుల చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయన్నారు.. అందుకే ప్రభుత్వ వైఫల్యం అంటున్నారని మండిపడ్డ ఆయన.. పోలీసులు సంయమనం పాటించ బట్టే పరిస్థితి అదుపు తప్పలేదన్నారు.. పెట్రో బాంబులు పథకం ప్రకారం జరిగిన కుట్రగా పేర్కొన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తేలాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Read Also: Konaseema: అన్ని పార్టీలు అ౦గీకరి౦చాయని మాకేమైనా లేఖ ఇచ్చారా?