Site icon NTV Telugu

Sailajanath: అది అరాచకపాలన కాక మరేంటి?

ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీలో జగన్ పాలన ఆటవిక పాలనగా మారుతుంది. కోర్టులో కేసులో ఉన్న పత్రాలు దొంగిలించడం అరాచక పాలనకు పరాకాష్ఠ. పోలీసు కట్టుకధలు మరింత విస్మయానికి గురి చేస్తున్నాయన్నారు ఏపీసీసీ చీఫ్‌ సాకె శైలజనాథ్. ఎక్కడో బీహార్లో విన్న కధలు.. ఏపీలో ప్రత్యక్షంగా చూస్తున్నాం.

దళిత బిడ్డలను చంపినా, కొట్టినా పట్టించుకోలేదు. నిన్న ఎస్పీ అంత అర్జంటుగా మీడియా సమావేశం పెట్టడం ఎందుకు..?వాళ్లు చెప్పిన అంశాలు నమ్మే విధంగా ఉన్నాయా..?ఎవరిచ్చారో ఇటువంటి కొత్త ఐడియాలు.ఎవరైనా తప్పులను ప్రశ్నిస్తే కొట్టేందుకు వెనుకాడటం లేదన్నారు. దళితులపై దాడి జరిగితే ఒక్క చర్య ఉండదు, కేసు నమోదు చేయరు. హోం మంత్రులుగా ఎస్సీలను చేసినా.. నామ్ కే వాస్తే మంత్రులే.

జగన్ చెప్పు చేతుల్లోనే అన్ని అధికారాలు. చేతులు కట్టుకోవడం, దండాలు పెట్టడమే మంత్రుల పని. జగన్ నోటి నుంచి వచ్చే మాట ఒకటి.. ఆచరణలో పెట్టేది మరొకటి అని మండిపడ్డారు శైలజానాథ్. ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. సలహాదారులకు లక్షల జీతాలు ఇచ్చి మేపుతున్నారు. వారి వల్ల రాష్ట్రానికి, సమాజానికి ఎటువంటి ప్రయోజనం లేదు.

ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, అప్పగించడమే జగన్ పని. అభివృద్ధి లేదు.. అవసరమైతే రోడ్లు కూడా అమ్మేస్తారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఏపీలో రూ. 1.50 లక్షల కోట్ల బడ్జెట్ ఉండేది. విభజన తరువాత రెండు లక్షల కోట్లు బడ్జెట్ పెట్టారు. అంటే పేద రాష్ట్రం కాదు.. ఏపీ ధనిక రాష్ట్రం. సీఎం, మంత్రులు అసత్యాలను ప్రచారం చేస్తూ మోసం చేస్తున్నారు. జగన్ ను ఆరాధిస్తే స్థలాలు వస్తాయని జర్నలిస్టులకే ఒక మంత్రి సూచన చేస్తారు. జగన్ తన ప్రయోజనాలను కాపాడే వారినే మంత్రులుగా పెట్టుకున్నారు.

ధరలు పెరిగితే ఆ భారం పేద, మధ్య తరగతి ప్రజల పైనే ఉంటుంది. ఇటువంటి అంశాల పై జగన్ కనీసం స్పందించరు. విద్యుత్ ధరలు పెంచి కొత్త భారాలు మోపారు. రాజ్యాంగానికి విరుద్దంగా జగన్ పాలన సాగుతుంది. రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని‌ కాంగ్రెస్ తరపున 20వ తేదీ నిర్వహిస్తామని శైలజానాథ్ చెప్పారు. జగన్ కూడా ఆలోచన మార్చుకుని ఒక్కసారి ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

Read Also: Kuna Ravikumar: నెల్లూరు ఎస్పీవి కట్టుకథలే

Exit mobile version