ఆంధ్రప్రదేశ్‌లో కేసుల పర్వం కొనసాగుతూనే ఉంది… తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి కుటుంబసభ్యులపై రౌడీషీట్, 107 బైండోవర్ కేసులు నమోదు చేవారు పోలీసులు… అచ్చెన్నాయుడు అన్నయ్య హరివరప్రసాద్, ఆయన కుమారుడు సురేష్, సమీప బంధువు కృష్ణమూర్తిపై రౌడీషీట్స్ నమోదు చేవారు… గత కేసుల ఆధారంగా బైండోవర్ కేసులను పెట్టినట్టు తెలిపారు కోటబొమ్మాళి పోలీసులు.. ఇక, బైండోవర్‌ను ఉల్లంఘించి క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నందున రౌడీషీట్లు తెరిచినట్టుగా చెబుతున్నారు. కాగా, ఏపీలో ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి వైసీపీ సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగా లేనిపోని కేసులు బనాయిస్తుందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.