Road Accident: నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం చాకిచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ వ్యాన్ ను ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి ముగ్గురు మృతి సంఘటన ప్రదేశంలో మృతి చెందారు. అలాగే, ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంటడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకి తరలించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు: నంబుల వెంకట నరసమ్మ, సుభాషిని, అభిరామ్ గా పోలీసులు గుర్తించారు.
Read Also: CM Chandrababu: నేడు అల్లూరి జిల్లా సీఎం చంద్రబాబు పర్యటన.. గిరిజనులతో మాట ముచ్చట..
ఇక, ప్రకాశం జిల్లా చాకిచెర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం తీరని లోటు అని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో తక్షణ చికిత్స కోసం మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తీవ్రంగా గాయపడ్డ వారిని నెల్లూరుకు తరలించి, వైద్య సదుపాయాలు సమకూర్చాలని అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.