Site icon NTV Telugu

RK Roja: రాష్ట్ర ప్రజలకు ఈ బడ్జెట్ ఎందుకు ఉపయోగపడదు..

Roja

Roja

RK Roja: ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించింది. జనాన్ని నమ్మించి నట్టేట ముంచింది కూటమి ప్రభుత్వం.. చంద్రబాబును పొగడ్తలతో ముంచేత్తడానికే, భజన చేయడానికే పయ్యావుల కేశవ్ సమయం అంతా వృథా చేశారంటూ ఎద్దేవా చేసింది. రాష్ట్ర ప్రజలకు ఈ బడ్జెట్ ఎందుకు ఉపయోగపడదు.. అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న ఇంకా జగనే తిడుతూ ఉన్నారు.. నాకు విజన్ ఉంది విస్తారాకుల కట్టా ఉంది అన్న చంద్రబాబు.. అప్పులు చేస్తూ కూర్చొన్నాడు అని ఆమె మండిపడింది. జగన్ చాలా తక్కువ అప్పులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించారు.. అప్పులు చేసి రాజధానిని ఎందుకు కట్టాలి, కట్టాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారు.. చేసిన అప్పులను తమ ఖాతాల్లోకి కూటమి నేతలు మళ్లించుకుంటున్నారు అని ఆర్కే రోజా ఆరోపించింది.

Read Also: R. Ashwin: సీఎస్కేకు తిరిగి రావడంపై ఓపెన్ అయిపోయిన అశ్విన్..

ఇక, ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు.. మహిళలకు ఇస్తామన్న రూ.1500పై బడ్జెట్‌లో ప్రస్తావన లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఉచిత బస్సు గురించి లేదని మాజీ మంత్రి రోజా అన్నారు. తల్లికి వందనం నిధులు కేటాయింపు చేయలేదు‌‌, అన్నదాతను మోసం చేశారు, డ్వాక్రా రుణాలు సున్నా వడ్డీకి ఇస్తామని మోసం చేశారు.. బడ్జెట్ ను పాజిటివ్ గా ప్రారంభించాల్సింది పోయి నెగిటివ్ గా మంత్రి ప్రారంభించారు.. లక్ష కోట్ల అప్పులు చేశామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదు అని ఆర్కే రోజా పేర్కొన్నారు.

Exit mobile version