Site icon NTV Telugu

Renigunta Fire Accident: ఆస్పత్రిలో మంటలు.. డాక్టర్ సజీవ దహనం, ఇద్దరు పిల్లలు మృతి

renugunta 1

C7eb31cd 7c4d 4c9a 87c1 E0b2be1810ba

తిరుపతి జిల్లా రేణిగుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆ అగ్నిప్రమాదం ఓ వైద్యుడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆస్పత్రి పై పోర్షన్‌ లో వుంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంలో వైద్యుడితో పాటు ఆయన కుమార్తె, కుమారులు మృతిచెందారు. వైద్యుడు ఘటనాస్థలంలోనే సజీవ దహనం కాగా.. ఆయన పిల్లలిద్దరూ చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో ఆప్రాంతంలో విషాదం నెలకొంది. ఆస్పత్రిలో మరికొందరు చిక్కుకుని పోయారని తెలుస్తోంది. రెస్క్యూ టీం ఇద్దరిని కాపాడింది.

Read Also: Breaking: రేణిగుంట ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

రేణిగుంట పట్టణం భగత్‌సింగ్‌ కాలనీలో డాక్టర్‌ రవిశంకర్‌రెడ్డి కార్తికేయ పేరుతో ఆస్పత్రి పెట్టారు. ఆయన కుటుంబం ఆస్పత్రి నిర్వహిస్తున్న భవనంలోనే పైఅంతస్తులో వుంటోంది. ఆదివారం ఉదయం వైద్యుడి కుటుంబం నివాసముంటున్న అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న తిరుపతి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు గమనించి వెంటనే రవిశంకర్‌రెడ్డి భార్య, అత్తను కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది అతికష్టం వైద్యుడి కుమారుడు భరత్‌ (12) కుమార్తె కార్తీక (15)లను పైఅంతస్తు నుంచి కిందికి దించారు.

అయితే ఆ పిల్లలిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారులు కూడా మృతిచెందారు. షార్ట్‌సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Read Also: Jobs Fraud in Cambodia : కాంబోడియాలో ఉద్యోగాలంటూ ఎర.. తిరుపతివాసికి నరకయాతన

Exit mobile version