AP Govt: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను ఏపీ సర్కార్ రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణాకు రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. మొత్తం 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తున్నట్ల ఎన్డీయే కూటమి ప్రభుత్వం పేర్కొనింది. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పని చేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణాకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్ లోని చివరి ర్యాంక్ లో మాత్రమే విధుల్లో చేరతారని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.
Read Also: Richard Lugner: ఆస్ట్రియన్ బిలియనీర్ రిచర్డ్ లుగ్నెర్ కన్నుమూత.. ఇటీవలే 6వ పెళ్లి చేసుకున్న రిచర్డ్
ఇక, దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న తెలంగాణ/ఏపీ ఉద్యోగుల బదీలపై నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఉద్యోగుల బదిలీలపై ఉన్న చిక్కుమూడిని కూటమి ప్రభుత్వం విప్పిందన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వం జీఓ విడుదల చేసిందన్నారు. సీఎం చంద్రబాబుకు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, కార్యదర్శి వలిశెట్టి దామోదర్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.