Site icon NTV Telugu

High Court: హైకోర్టులో చింతమనేని ప్రభాకర్‌కు ఊరట

Chintamaneni Prabhakar

Chintamaneni Prabhakar

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి చర్యలపై కోర్టు స్టే విధించింది. వారం క్రితం చింతపూడిలో ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఓ గొడవ చోటు చేసుకుంది. ఆ సందర్భంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో కోర్టుని ఆశ్రయించిన ప్రభాకర్, ఎస్టీ – ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేలా తాను ఎటువంటి చర్యలకు పాల్పడలేదన్నారు. వాదనలు విన్న కోర్టు, కేసులో తదుపరి చర్యలపై స్టే విధిస్తూ.. విచారణకు వాయిదా వేసింది.

Read Also: APSRTC: ‘ప్రైవేట్’ ఆర్టీసీపై క్లారిటీ ఇచ్చిన ఎండీ

అసలేం జరిగింది?
కాగా.. గత సోమవారం రాత్రి చింతపూడి మండలం ప్రగడవరం పంచాయతీ అంకంపాలెంలో నిర్వహించిన బాదుడే బాదుడే కార్యక్రమంలో.. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభాకర్ మాట్లాడారు. ఆ సమయంలో వైసీపీ నాయకులు స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో కలిసి అక్కడికి వెళ్ళారు. తమ నాయకుడ్ని అవమానించేలా మాట్లాడుతారా? అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంలో ప్రభాకర్ తనను కులం పేరుతో దూషించారని సర్పంచి తొమ్మండ్రు భూపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆయనపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.

Exit mobile version