Andhra Pradesh: విజయవాడలోని సింగ్ నగర్ తో పాటు వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వాటర్ ట్యాంకులు తెప్పించి నీటి సరఫరాను ప్రారంభించారు. అన్ని ప్రాంతాలకు వాటర్ ట్యాంకుల ద్వారా మంచి నీరు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. గత మూడు రోజులుగా కరెంట్, నీళ్ళు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డామంటున్నారు. కనీసం మహిళలు వాష్ రూంలకు వెళ్ళాలన్నా నీరు లేకపోవడంతో.. చెప్పుకోలేని కష్టాలు అనుభవించామని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే సహాయాన్ని కేవలం మెయిన్ రోడ్డులకే పరిమితం చేయటంతో.. శివారు ప్రాంతాలకు నీటి సరఫరా లేక ఇబ్బందులు పడ్డాం.. అన్నీ ప్రాంతాలకు నీరు వెళ్ళేలా చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
Read Also: PKL 2024: అక్టోబర్ 18 నుంచి పీకేఎల్ సీజన్ 11 ప్రారంభం..
అలాగే, సింగ్ నగర్ ఫ్లై ఓవర్ ప్రాంతంలో పూర్తిగా వరద ఉధృతి తగ్గిపోయింది. వాహనాల రాకపోకలకు మార్గం సుగమం అయింది. నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ఎక్కడికక్కడ మోటార్ బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ బోట్లు నిలిచి పోయాయి. ఇప్పుడిప్పుడే నీరు తగ్గటంతో మునిగిపోయిన వాహనాలు బయట పడుతున్నాయి. వరదల్లో చిక్కుకుపోయిన వాళ్లు ఇళ్ల నుంచి మెల్లిగా బయటకు వస్తున్నారు. తమకు కనీస సదపాయాలను కల్పించాలని కోరుతున్నారు.