NTV Telugu Site icon

Varahi: పవన్ కళ్యాణ్ ‘వారాహి’కి లైన్‌క్లియర్.. అన్ని అనుమతులు ఉన్నాయని ఆర్టీఏ ప్రకటన

Varahi

Varahi

Varahi: పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి సంబంధించి మరో ట్విస్ట్ నెలకొంది. ఈ వాహనం రిజిస్ట్రేషన్ వాయిదా పడిందని వార్తలు వచ్చి కొద్దిగంటలు కూడా ముగియకముందే వారాహి రిజిస్ట్రేషన్ ఎప్పుడో పూర్తయిందని తెలంగాణ రవాణా శాఖ వెల్లడించింది. దీంతో జనసేన పార్టీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారాహికి లైన్ క్లియర్ అయిందని.. ఈ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయని.. వారం కిందటే రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని స్వయంగా తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు. వారాహి వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని ఆయన స్పష్టం చేశారు. వాహనం బాడీ తయారీకి సంబంధించిన సర్టిఫికెట్‌ను పరిశీలించామని.. అన్ని నిబంధనలు ఉన్నాయని.. వాహనం రిజిస్ట్రేషన్ కోసం చట్ట ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో వారాహి వాహనం రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. వారాహి వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX8384 అని కూడా వెల్లడించారు.

Read Also: Ram Charan: అమ్మానాన్న కాబోతున్న రామ్ చరణ్ – ఉపాసన!

కాగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం రూపొందించిన వారాహి వాహనం ఆర్మీ రంగులో ఉందని.. ఈ వాహనం రిజస్ట్రేషన్‌కు రవాణాశాఖ అనుమతి ఇవ్వడం కష్టమని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇష్టం వచ్చిన వాహనాలు వాడటానికి ఇదేమీ సినిమా కాదని కౌంటర్లు ఇచ్చారు. ఇటువంటి రంగు వాహనంతో సినిమాల్లో నటించవచ్చని.. కానీ రియల్ లైఫ్‌లో ఈ కలర్ వాహనాలను ప్రచారానికి ఉపయోగించకూడదని సూచనలు కూడా ఇచ్చారు. అయితే తెలంగాణ ఆర్టీఏ అధికారులు వైసీపీ నేతల విమర్శలకు చెక్ పెట్టారని జనసేన అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.