Site icon NTV Telugu

Thota Trimurthulu: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందా..?

Thota

Thota

Thota Trimurthulu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందా?.. అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రశ్నించారు. ప్రభుత్వాలు, అధికారాలు ఎవరికి శాశ్వతం కాదు అన్నారు. కోర్టుల దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం చెల్లదు.. 200 మంది పోలీసులు వచ్చి ధ్వంసం చేశారు.. ల్యాండ్ సీలింగ్ కేసు ఉందని నా కుటుంబ సభ్యులకు చెందిన చెరువులు ధ్వంసం చేశారు.. అడిగితే ఈ భూమి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఉందని అధికారులు చెప్తున్నారు అని ఆయన మండిపడ్డారు. 2005లో ఈ భూమి నేను కొన్నాను.. రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్ ప్లస్ ల్యాండ్ కాదని గతంలోనే చెప్పారు.. ఆర్డీఓ నెల రోజుల కిందట నోటీసు ఇచ్చారు.. దానికి సమాధానం ఇచ్చాం.. 11 ఎకరాల 38 సెంట్లు ఎక్కువ ఉందని తీసుకుంటున్నాము అని చెప్తున్నారు అని తోట త్రిమూర్తులు అన్నారు.

Read Also: Japan Floods: జపాన్‌ను ముంచెత్తిన వరదలు.. ఎమర్జెన్సీ అలర్ట్ జారీ

ఇక, వైసీపీకి చెందిన వ్యక్తి అని నన్ను టార్గెట్ చేశారు అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. 151 చోట్ల గెలిచిన జగన్ కి 11 సీట్లు వచ్చాయి.. ప్రజలు ఆలోచనలు ఎప్పుడు ఒకే లా ఉండవు అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఒక సారి ఆలోచించాలి అని చెప్పారు. ఈ దుర్మార్గం, అన్యాయం ఏంటో నాకు అర్థం కావడం లేదు అని పేర్కొన్నారు. ఇలాంటి ఆలోచనలు ఉంటే ఏ గతి పడుతుందో చూడాలి.. అధికారులు ఎవరిని సంతృప్తి పరచడానికి ఈ పనులు చేస్తున్నారు అంటూ తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version