NTV Telugu Site icon

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.. రికార్డ్ స్థాయిలో వరద..!

Prakasham

Prakasham

Prakasam Barrage: కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయి వరద వచ్చి చేరుతోంది. 11 లక్షల 20 వేల క్యూసెక్కులకు వరద చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇక, బ్యారేజీలోని 70 గేట్లు ఎత్తి కిందకు వరద నీటిని రిలీజ్ చేస్తున్నారు. బ్యారేజీ చరిత్రలో తొలిసారిగా రికార్డ్ స్థాయిలో వరద వచ్చింది.. 2009 అక్టోబర్‌లో 10 లక్షల 94 వేల క్యూసెక్కుల వరద రాగా.. 1903 వ సంవత్సరంలో 10 లక్షల 60 వేలు క్యూసెక్కుల వరద నీరు వచ్చింది.. ఇక, బ్యారేజీ దిగువ భాగాన అనేక గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి.

Read Also: Rahul Gandhi : ఫేక్ వార్తలపై కాంగ్రెస్ అప్రమత్తం.. దేశవ్యాప్తంగా క్విక్ రెస్పాన్స్ టీమ్‌ ఏర్పాటు

కాగా, ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తి అధికారులు నీటిని రిలీజ్ చేస్తున్నారు. బ్యారేజీ దగ్గర ఎప్పుడు లేని విధంగా 23.6 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో అవుట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంది. దీంతో రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. కృష్ణ కెనాల్ జంక్షన్ నుంచి కృష్ణా నది మీదుగా రైళ్లను డెడ్ స్లో చేసి నడుపుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Read Also: Pawan Kalyan Birthday: పవన్‌ కల్యాణ్‌ ఫాన్స్‌కు నిరాశ.. అప్‌డేట్స్‌ అన్నీ క్యాన్సిల్!

ఇక, ప్రకాశం బ్యారేజీ నుంచి రికార్డు స్థాయిలో వరద నీరు రావడంతో రామలింగేశ్వర నగర్ మునిగిపోయింది. ఇళ్లను ఖాళీ చేసి ప్రజలు బయటకి వెళ్లిపోతున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంతో నిన్నటి వరకూ ప్రజలు సురక్షితంగా ఉన్నారు. అయితే, శ్మశానం రోడ్ దగ్గర గోడ పైనుంచి లోపలకు వరద నీరు వచ్చి చేరుతుంది.. మొత్తం వెనక్కి తన్నడంతో నీరు ఇళ్లలోకి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే దివిసీమను సైతం వరద తీవ్రత తాకేసింది. పులిగడ్డ దగ్గర 21 అడుగులకు వరద నీరు చేరడంతో.. పులిగడ్డ అక్విడెక్టు నీటిలో చిక్కుకు పోయింది. మోపిదేవి మండలంలోని కే కొత్త పాలెం ఎస్సీ వాడలోకి వరద నీరు రావడంతో కాలనీలో నివాసం ఉంటున్న 600 మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు.