Site icon NTV Telugu

Rama Siva Reddy: ఫోన్‌ ట్యాపింగ్‌ ఇష్యూ.. అసలు విషయం బయటపెట్టిన కోటంరెడ్డి స్నేహితుడు..!

Rama Siva Reddy

Rama Siva Reddy

Rama Siva Reddy: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు కలకలం సృష్టించాయి.. అయితే, ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో అసలు విషయాన్ని బయటపెట్టారు కోటంరెడ్డి స్నేహితుడు.. ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై ఇవాళ మీడియాతో మాట్లాడారు కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి.. ట్యాపింగ్ ఆరోపణలను ఖండించారు. ఇది ట్యాపింగ్ కాదని స్పష్టం చేశారు.. నా ఫోన్ కేంద్ర హోంశాఖకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు రామశివారెడ్డి.. అది ట్యాపింగ్ ఆడియో కాదన్న ఆయన.. నా ఫోన్‌లో ప్రతీ కాల్‌ రికార్డ్‌ అవుతుంది.. వేరే కాంట్రాక్టర్‌కు నా ఫోన్ నుంచి షేర్ అయ్యిందని తెలిపారు. నాది ఆండ్రాయిడ్ ఫోన్.. మా ఇద్దరివి ఐఫోన్లు అంటూ కోటంరెడ్డి తప్పుగా చెప్పారని విమర్శించారు. ఇక, నాపై ఎవరి ఒత్తిడి లేదన్న రామశివారెడ్డి.. నిజాలు చెప్పేందుకే మీడియా ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు.

Read Also: PM Narendra Modi: ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది.. కొందరు దేశ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

కాగా, కోటంరెడ్డి చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ కాగా.. ఆ తర్వాత ఆయనను అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దూరం పెట్టింది.. ఆయన ప్రతినిథ్యం వహిస్తోన్న నెల్లూరు రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని ఇంచార్జ్‌గా పెట్టింది వైసీపీ అధిష్టానం.. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది.. కోటంరెడ్డి తన వెనుకే ఉంటారని భావించిన కొందరు నేతలు క్రమంగా చేజారిపోయారు.. ఆదాలకు మద్దతు ప్రకటించారు. ఇక, కోటంరెడ్డి, వైసీపీ నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్న విషయం విదితమే.

Exit mobile version