బలపడిన అల్పపీడనం : మరో రెండు రోజులు వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో… వచ్చే రెండు రోజులు ఏపీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులెవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలో వచ్చే రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడొచ్చంటోంది… వాతావరణ శాఖ. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని… మత్స్యకారులు వేటకు వెళ్లడాన్ని నిషేధించామని అధికారులు తెలిపారు. తహసీల్దార్లు, ప్రభుత్వ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని… విశాఖ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో కాకినాడలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షం పడింది. కాకినాడ ప్రభుత్వాస్పత్రి మాతాశిశు విభాగంలో నీరు చేరడంతో బాలింతలు, గర్భిణిలు ఇబ్బంది పడుతన్నారు. గర్భిణిల వార్డులకి కిటికీల ద్వార నీళ్లు రావడంతో… బెడ్స్ తడిసిపోయాయి. దాంతో ఒకే మంచాన్ని ముగ్గురు గర్భిణులకు కేటాయించారు. ఇక మెడికల్ స్టోర్‌లోకి కూడా నీళ్లు చేడంతో… మోటర్ సాయంతో నీళ్లు తోడేస్తున్నారు. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. విశాఖలో 5, కళింగపట్నంలో 4, తునిలో 3. నరసాపురం, విజయవాడల్లో రెండేసి సెంటీమీటర్ల మేర్థం పడింది. భారీ వర్షాలకు సీలేరు కాంప్లెక్స్‌లో వరద ప్రవాహం పెరుగుతోంది. డొంకరాయి జలాశయం నుంచి 6,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!