పులిచింతల వద్ద కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు వద్ద ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బ్యారేజీ పూర్తిస్థాయిలో నిండింది. దీంతో నీరును గేట్టు ఎత్తి దిగువకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకొని గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం చేసే సమయంలో ప్రాజెక్టులోని 16 వ నెంబర్ గేటు విరిగిపోయింది. దీంతో ఎమర్జెన్సీ గేటును ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టు వద్దకు రాకపోకలను నిలిపివేశారు. పులిచింతల నుంచి ప్రస్తుతం దిగువకు 3లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతున్నది. గేటు విరిగిపోవడంతో ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో ఉండే గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.
Read: ఒక్కసారిగా ఆళ్లగడ్డలో యాక్టివ్ అయిన మాజీ మంత్రి…