NTV Telugu Site icon

Prakasam: ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో అల్లకల్లోలంగా మారిన సముద్రం..

Pkm

Pkm

Prakasam: అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్ర తీరంలో అలల ఎగసి పడుతున్నాయి. దీంతో జిల్లాలోని ఐదు తీర ప్రాంత మండలాల్లో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం జిల్లాకు చేరుకుంది. తీర ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేసిన అధికారులు.. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు చేశారు.

Read Also: Madhyapradesh : యూట్యూబ్ లో చూసి అమ్మాయిని కొనుక్కునేందుకు వచ్చిన యువకుడు.. తర్వాత ఏమైందంటే ?

అయితే, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేయటంతో ఈరోజు కూడా అధికారులు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. ఏడు మండలాల్లో నేడు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అర్ధవీడు, దోర్నాల, కంభం, పెద్దారవీడు, మార్కాపురం, రాచర్ల, ముండ్లమూరు మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఇప్పటి వరకు జిల్లాలో 125 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. కాగా, భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు రోడ్లపై పొంగి ప్రవహిస్తుంది. దీంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.