NTV Telugu Site icon

Minister Dola Bala Veeranjaneya Swamy: చెట్లు పెంచడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత..

Bala Veeranjaneya Swamy

Bala Veeranjaneya Swamy

Minister Dola Bala Veeranjaneya Swamy: చెట్లు పెంచడం ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పిలుపులో భాగంగా.. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం జరుగుతున్న విషయం విదితమే కాగా.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పంగులూరువారిపాలెంలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెట్లు పెంచడం ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించాలన్నారు.. జీవకోటి రాశుల మనుగడకు మొక్కలే జీవనాధారం అన్నారు.. సహజవనరులు, అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కడ పర్యటనకు వెళ్లినా చెట్లు నరికేశారు అని ఆరోపణలు గుప్పించారు.. కానీ, రానున్న ఐదేళ్లలో ఏపీని గ్రీన్ ఏపీగా మార్చుదాం, దీనికి ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఒక మొక్కను నాటాలి.. అందరూ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.

Read Also: Radha Vembu: దేశంలోనే అత్యంత సంపన్న మహిళ.. నికర విలువ 47000 కోట్లు!