NTV Telugu Site icon

RGV: ముంచుకొస్తున్న పోలీసుల డెడ్‌లైన్..! ఆర్జీవీ ఏం చేస్తారు..?

Rgv

Rgv

RGV: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఇప్పుడు ఏం చేస్తారు? అనేది ఉత్కంఠగా మారింది.. ఓ వైపు పోలీసుల పెట్టిన డెడ్‌లైన్‌ ముంచుకొస్తుంది.. మరోవైపు.. హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.. ఇవాళ ప్రకాశం జిల్లా మద్ధిపాడు పోలీస్ స్టేషన్‌లో డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ విచారణకు హాజరుకావాల్సి ఉంది.. ట్విట్టర్‌ (ఎక్స్)లో అనుచిత పోస్టింగ్ పై టీడీపీ నేత ఫిర్యాదుతో రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు పోలీసులు.. అంతేకాదు.. ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసులు కూడా జారీ చేశారు.. అయితే, హాజరుకు రెండు వారాల సమయం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు రాంగోపాల్ వర్మ.. కానీ, పోలీసుల ముందు హాజరుకు గడువు కావాలంటే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ నే అభ్యర్థించాలని స్పష్టం చేసింది కోర్టు.. దీంతో.. వర్మకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.. అనివార్యంగా ఇవాళ మద్ధిపాడు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది.. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు ఆర్జీవీ ఏం చేస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అసలు విచారణకు వస్తారా? పోలీసు విచారణ నుంచి తప్పించుకోవడానికి ఇంకా ఏదైనా చేస్తారా? మరోసారి కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా? ఇలా ఆర్జీవీ వ్యవహారంలో ఉత్కంఠ నెలకొంది.

Read Also: Temperature Drop: వణికిస్తున్న చలి.. సింగిల్‌ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

కాగా, రాంగోపాల్ వర్మ తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.. ఇక, ఆర్జీవీ పిటిషన్‌పై సోమవారం రోజు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.. అరెస్ట్‌పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది.. మంగళవారం విచారణ హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారని పిటిషన్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. హాజరు అయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది అభ్యర్థించారు.. ఇక, సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసులు ముందు చేసుకోవాలని సూచించింది హైకోర్టు.. ఇటువంటి అభ్యర్థన కోర్టు ముందు కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.. కాగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరి చేలా పోస్టులు పెట్టారని రాంగోపాల్ వర్మపై అభియోగాలున్నాయి.. ఆ అభ్యంతరకర పోస్ట్ లు వర్మ పెట్టారని టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.. ఆ కేసు విషయంలో ఆర్జీవీ హైకోర్టు మెట్లు ఎక్కగా.. హైకోర్టులో ఆర్జీవీకి చుక్కెదురైంది.. మరి వర్మ ఈ రోజు ఏం చేస్తారో చూడాలి..