NTV Telugu Site icon

Mother Killed Son: వ్యసనాలకు బానిసైన కొడుకును చంపిన తల్లి.. కేసులో బిగ్ ట్విస్ట్!

Murder

Murder

Mother Killed Son: ప్రకాశం జిల్లాలోని కంభం తెలుగు వీధిలో కందం శ్యామ్ ప్రసాద్ హత్య ఘటనపై పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. శ్యామ్ అనే వ్యక్తిని ఇద్దరు సోదరులు, మరో వ్యక్తి సాయంతో తల్లి లక్ష్మీదేవీ ( అలియాస్ సాలమ్మ) హత్య చేయించిందని నిర్థారించారు. శ్యామ్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి గోనే సంచుల్లో కుక్కి మేదర వీధి సమీపంలోని పంట కాలువ వద్ద నిందితులు పడవేశారు. పంట కాలువ వద్ద మృతదేహాన్ని పడవేస్తుండగా చూసిన స్థానికులు.. శ్యామ్ ని చంపారని చుట్టుపక్కల పుకార్లు వ్యాప్తి చెందడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. శ్యామ్ అన్న సుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించడంతో వెలుగులోకి హత్య ఘటన వచ్చింది.

Read Also: KA 10 : దిల్ రూబా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

ఇక, మద్యానికి బానిసై సైకోగా ప్రవర్తిస్తున్న కొడుకు శ్యామ్ ను తల్లి హత్య చేయించిందని పోలీసులు పేర్కొన్నారు. లారీ క్లీనర్ గా రెండు రోజుల క్రితం కర్నూలు వెళ్లిన శ్యామ్.. అక్కడ మద్యం తాగి గొడవ చేయడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకు వచ్చారు. ఆ తర్వాత హత్య చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, పోలీసుల పర్యవేక్షణలో శ్యామ్ మృతదేహానికి ఇవాళ పోస్టుమార్టం జరగనుంది. మృతదేహం లభించిన దగ్గరే పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. కాగా, రాత్రంతా మృతదేహం వద్ద కాపలాగా పోలీసులు ఉన్నారు.