NTV Telugu Site icon

RTC Bus Accident: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందేలా చేస్తాం.. కలెక్టర్ హామీ

Darsi Bus Accident Issue

Darsi Bus Accident Issue

Prakasam Collector AS Dinesh Kumar Comments On RTC Bus Accident: ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాద సంఘటన స్థలాన్ని కలెక్టర్ ఏయస్ దినేశ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. ఆర్టీసీ, ట్రాన్స్‌పోర్ట్, పోలీసు అధికారుల ఆధ్వర్యంలోని టెక్నికల్ బృందాలతో విచారణ చేస్తామన్నారు. ఇరుకుగా ఉన్న బ్రిడ్జిని దాటిన బస్సు, ఓ కల్వర్టును ఢీకొట్టిన తర్వాత ఈ ఘటన జరిగిందని వివరించారు. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం కారణం కాకపోవచ్చన్నారు. ఎంత వేగంతో బస్సు వెళ్తుందనేది విచారణలో తేలుతుందన్నారు. మృతదేహాల పోస్ట్‌మార్టం కోసం ఆరుగురు వైద్యులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి తప్పకుండా ఎక్స్‌గ్రేషియా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన బాధ్యులపై కచ్ఛితంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Kim Yo Jong: ఉత్తర కొరియా గగనతలంలోకి అమెరికా గూఢచారి విమానం.. కిమ్ సోదరి వార్నింగ్!

ఇదిలావుండగా.. కాకినాడలోని ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరవ్వడం కోసం ఓ పెళ్లి బృందం ఒక ఆర్టీసీ బస్సుని అద్దెకు తీసుకుంది. పొదిలి నుంచి ఈ బస్సు కాకినాడకు బయలుదేరింది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణిస్తున్నారు. దర్శి వరకు వీరి ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ.. దర్శి సమీపంలో ఎదురుగా ఒక బస్సు సడెన్‌గా రావడంతో, ఆర్టీసీ బస్సు డ్రైవర్ దాన్ని తప్పించబోయాడు. అప్పుడు బస్సు అదుపు తప్పి.. పక్కనే ఉన్న కాలువలో పడింది. బస్సు తలక్రిందులుగా పడటంతో.. ఒకరిపై మరొకరు పడి, ఊపిరాడక 7 మంది మరణించారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

School Bus Accident: కారును ఢీకొట్టిన పాఠశాల బస్సు…. ప్రమాదంలో ఆరుగురి మృతి

Show comments