NTV Telugu Site icon

CM Chandrababu: పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించాను..

Chandrababu

Chandrababu

CM Chandrababu: తిరుపతిలోని శ్రీసిటీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీసిటీలోని 8 వేల ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.. శ్రీసిటీలో 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉంది అని తెలిపారు. త్వరలో పారిశ్రామిక పాలసీనీ విడుదల చేస్తాం.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి.. 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి సాధించడం గొప్ప విషయం.. పారిశ్రామిక వేత్తలు ఉపాది, సంపదను సృష్టిస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. 15 శాతం గ్రోత్ తో అభివృద్ధి చెందడమే లక్ష్యంగా పని చేస్తాం.. పీపీపీ మోడల్ ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామన్నారు. గతంలోనూ హైటెక్ సిటిని పీపీపీ మోడల్ ద్వార నే అభివృద్ధి చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: Raksha Bandhan: అన్నా- చెల్లెలి అనుబంధం.. టాలీవుడ్ హీరోలకు వరం

కాగా, పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు సాధన కోసం పలు దేశాలు పర్యటించాను.. ఒకప్పుడు ఐటి అంటే బెంగుళూరు అనే వాళ్ళు.. అలాంటిది ఛాలెంజ్ గా తీసుకుని హైదారాబాద్ ఐటి హబ్ గా మార్చాను.. ఇక, ప్రపంచంలో ఎక్కడికెళ్ళిన భారతీయులు ఉంటారు.. ప్రతి నలుగురు ఐటి నిపుణుల్లో భారతీయాలు ఒకరుంటారు.. ఇప్పుడు అమరావతి నిర్మాణం జరుగుతుంది.. ఉత్పత్తి, రవాణా ఖర్చులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి.. రాజధానిలో అన్ని రకాలు సౌకర్యాలు ఉండేలా నిర్మాణం చేపడుతాం.. ఎలక్ట్రానిక్ వాహనాలపై ఫోకస్ పెట్టాం అని చంద్రబాబు పేర్కొన్నారు.