Raksha Bandhan: అన్నా- చెల్లెలి అనుబంధం.. టాలీవుడ్ హీరోలకు వరం
- సిస్టర్ సెంటిమెంట్ లో వచ్చిన సినిమాలకు హిట్ గ్యారంటీ
- టాలివుడ్ లో సిస్టర్ సెంటిమెంట్ సినిమాలకు గిరాకి
- స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చినవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు మోజులో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు రావట్లేదు గాని ఒకప్పుడు అన్నా – చెల్లెలి కథాంశంతో సినిమా వచ్చిందంటే సూపర్ హిట్ అవ్వాల్సిందే. అంతగా టాలీవుడ్ ప్రేక్షకులు కుటుంబ కథా చిత్రాలను ఆదరించేవారు. మన టాలీవుడ్ లో స్టార్ హీరోల నుండి కుర్ర హీరోల వరకు అన్నా చెల్లెలి సెంటిమెంట్ సినిమాలతో హిట్ కొట్టిన హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం పదండి..
మెగాస్టార్ చిరంజీవి –
Also Read
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో అన్నా చెల్లెలి భావోద్వేగాల కథాంశంతో మెగాస్టార్ నటించిన హిట్లర్ పెద్ద కమర్షియల్ హిట్. వరుస పరాజయాలకు బ్రేక్ ఇచ్చి చిరు కు సూపర్ సక్సెస్ అందించింది. రాబోతున్న విశ్వంభరలో కూడా అన్నా చెల్లి సెంటిమెంట్ కు బలమైన ప్రాధాన్యత ఉంటుందని ఐదుగురు సోదరీమణులకు అన్నయ్యగా చిరు కనిపిస్తున్నట్లు సమాచారం
నందమూరి బాలకృష్ణ –
బాలయ్య నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా సమరసింహా రెడ్డి చెల్లెల్ల ప్రేమ కోసం తాపత్రేయ పడే అన్న పాత్రలో నటించి ప్రేక్షకులతో కంటతడి పెట్టించాడు. అన్నయ అడిగితే ఐదవ తనాన్ని కూడా ఇచ్చేస్తానన్న చెల్లిని చూసి గర్వాంగా ఉందమ్మా అన్న డైలుగులు ప్రేక్షకులతో కంటతడి పెట్టించాయి.
విక్టరీ వెంకటేష్ –
వెంకీ మావయ్య హీరోగా నటించిన జయం మనదేరా చిత్రంలోని అన్నా చెల్లెలి అనురాగాలు ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇక వెంకీ హిట్ చిత్రాలలో ఒకటైన గణేష్, వినాయక్ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి, వాసు సినిమాలలోనూ సిస్టర్ సెంటిమెంట్ బలంగా ఉంటుంది.
JR.NTR –
రాఖీ పండగ అనగానే మొదట గుర్తొచ్చే సినిమా కృష్ణవంశీ దర్శకత్వంలో తారక్ నటించిన రాఖీ. మానవ మృగాల వేటలో హత్య గావింపబడిన ఎందరో చెల్లెల్ల ఆత్మ శాంతికై వేటాడే పులిలా తారక్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
పవన్ కళ్యాణ్ –
భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అన్నవరం సినిమా అన్నయ్య, చెల్లెలి ప్రేమానురాగాల నేపథ్యంలో సాగుతూ హిట్ గా నిలిచింది.
రాజశేఖర్ –
రాజశేఖర్ నటించిన గోరింటాకు సినిమాకు కంటతడి పెట్టని ప్రేక్షకుడు లేరంటే అతిశయోక్తి కాదు. హిట్లు లేక సతమతమవుతున్న రాజశేఖర్ కు సూపర్ హిట్ ను అందించిన చిత్రం గోరింటాకు.
అర్జున్ –
అర్జున్ హీరోగా నటించిన పుట్టింటికి రా చెల్లి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అత్తగారి ఇంట చెల్లెలు అనుభవించే కష్టాల నుండి చెల్లిని రక్షించే కథాంశంతో తెరకెక్కింది పుట్టింటికి రా చెల్లి.
ఇవే కాకుండా అర్జున్, ముద్దుల మావయ్య, రక్త సంబంధం, శివరామరాజు, బంగారు గాజులు, చంటి, శౌర్యం, వీరభద్రఇలా చెప్పుకుంటూ పొతే టాలీవుడ్ లో అన్నా చెల్లెలి కథా నేపథ్యంలో వచ్చిన సినిమాలు, వాటి హిట్ రేషియోలు చాలా ఎక్కువ. ఎప్పుడైనా తోడబుట్టిన చెల్లి, అక్క అన్నకు అండగా నిలబడితే విజయం తథ్యం అది సినిమా రంగం అయిన రాజకీయరంగం అయిన సరే.
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!