Site icon NTV Telugu

Minister Kandula Durgesh: పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం.. వైసీపీ చేసినవి అసత్య ఆరోపణలు

Kandula

Kandula

Minister Kandula Durgesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఖండించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై చేస్తున్నవి అసత్య ఆరోపణలు అన్నారు. పీపీపీ విధానం ద్వారా నిర్మాణాల్లో వేగం పెరుగుతుంది.. నిర్మాణం పూర్తైన అనంతరం కాలేజీలపై నియంత్రణ, యాజమాన్య హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది.. తద్వారా వైద్య విద్య ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తుంది అన్నారు. పీపీపీ విధానంలో నిర్మిస్తున్న కొత్త మెడికల్ కాలేజీలతో పాటు ప్రతి మెడికల్ కాలేజీలో కనీసం 150 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరిగే ఆవకాశం ఉందన్నారు. వాస్తవాలను పక్కన పెట్టి రూ.8,500 కోట్ల విలువైన కాలేజీలను రూ.5,000 కోట్లకు బినామీలకు లీజుకు ఇస్తున్నారని వక్రీకరణ చేస్తున్నారు అని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.

Read Also: Suriya : వరుస ఫ్లాపులు.. రూట్ మార్చిన సూర్య

ఇక, వైద్య విద్య, ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆర్థిక సమస్యలతో మూలనపడ్డ కాలేజీలను మళ్లీ పీపీపీ విధానంలో పట్టాలు ఎక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. సుదీర్ఘ కసరత్తు చేసి కేబినెట్ లో సమగ్రంగా చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పు దోవ పట్టించడం సరైన విధానం కాదు అని సూచించారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానమని మెడికల్ సీట్ల ఫీజును రూ.12 లక్షలు చేసి అమ్మకానికి పెట్టే విధానాన్ని తెచ్చిన గత ప్రభుత్వం నేడు పీపీపీ విధానాన్ని తప్పు పట్టడం విచిత్రంగా ఉందన్నారు. తాము 17 మెడికల్ కాలేజీలు కడితే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేస్తుందని జగన్ చేస్తున్నది విష ప్రచారం.. అన్ని కాలేజీలకు కలిపి రూ.8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా వైసీపీ హయాంలో కేవలం 17 శాతం మాత్రమే ఖర్చు పెట్టారు.. గత ప్రభుత్వ హయాంలో 5 కాలేజీలు నిర్మించినట్లు చెప్పుకుంటున్నారు.. ఆ కాలేజీల్లోనూ కనీసం సిబ్బందిని కూడా నియమించలేదు.. అలాగే, హాస్టళ్లు, అడ్మినిస్ట్రేషన్ విధానం అందుబాటులో లేదు.. వాటిలో క్లాసులు కూడా ప్రారంభం కాలేదు.. మరి మిగతా వాటి పరిస్థితి ఏంటి? అని మంత్రి కందుల దుర్గేష్ ప్రశ్నించారు.

Exit mobile version