NTV Telugu Site icon

NTPC VIZAG: ఎన్టీపీసీ సింహాద్రి 4 యూనిట్లలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

Ntpc Viag

Ntpc Viag

ఏపీలో ఒకవైపు విద్యుత్ కోతలు.. మండుతున్న ఎండలతో జనం ఇబ్బందులు పడుతున్న వేళ మరో పిడుగు పడింది. విశాఖపట్టణం సమీపంలోని ఎన్టీపీసీ సింహాద్రిలోని 4 యూనిట్లలో ఒకేసారి విద్యుదుత్పత్తి నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. మంగళవారం ఉదయం 3 గంటల నుంచి 2 వేల మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఎన్టీపీసీ పరిసరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విద్యుదుత్పత్తిని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. ఒకేసారి నాలుగు యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోవడం ఇదే ప్రథమం అని అధికారులు తెలిపారు.

గ్రిడ్‌ నుంచి కూడా ఎన్టీపీసీ సింహాద్రికి విద్యుత్ సరఫరా కావడం లేదు. దీనికి తోడు గత అర్ధరాత్రి నుంచి పరవాడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తుండడం మరింత ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. మరోవైపు, ఉమ్మడి విశాఖ జిల్లాకు అవసరమైన కలపాల 400 కేవీ విద్యుత్ స్టేషన్‌కు గ్రిడ్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో చీకట్లు అలముకున్నాయి. దాదాపు రెండున్నర గంటలు శ్రమించిన అధికారులు గ్రిడ్ నుంచి ఎన్టీపీసీ సింహాద్రికి విద్యుత్‌ను పునరుద్ధరించి పాక్షికంగా సరఫరా చేస్తున్నారు. మరోవైపు హిందూజా పవర్ ప్లాంట్లలోనూ నిలిచిపోయింది విద్యుత్ ఉత్పత్తి.

Bigg Boss Show: బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్ట్ సీరియస్