ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య కోడి గుడ్ల వివాదం ఇంకా చల్లారలేదు. ఒడిశాలోని కుర్ధా రోడ్ వద్ద ఏపీకి చెందిన కోడిగుడ్ల లారీలను ఒడిశా పౌల్ర్టీ రైతులు, ట్రేడర్స్ అడ్డుకున్నారు. సుమారు రెండు వందల కోడిగుడ్ల లారీలు జాతీయరహాదారిపై నిలచిపోయాయి. ఏపీ ఎగ్ ట్రేడర్స్ తో చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. ఎండ వేడికి గుడ్లు పాడవుతాయని ఆంధ్ర రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేతల ధరలు పెరుగుతుండటం, గుడ్డు ధర పెరగకపోవడంతో ఒడిశా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రల గుడ్లు రానీయకుండా అడ్డుకొని, ధరలు పెంచుకునే యోచన చేస్తున్నారు. దీంతో, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బీహర్ ఈశాన్య రాష్ట్రాలకు నిలిపోయాయి ఆంధ్రప్రదేశ్ ఎగుమతులు. గుడ్ల ఎగుమతులును అడ్డుకోవడం పై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు ఏపీ ఎగ్ ట్రేడర్స్.
Eggs: ‘కోడి గుడ్డు’ వివాదం.. ఆందోళనకు దిగిన రైతులు

Eggs