NTV Telugu Site icon

Political Heat in Nellore: చలికాలంలో హీట్‌ పెంచుతున్న పొలిటికల్‌ సెగలు..

Political Heat

Political Heat

Political Heat in Nellore: నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో…పాలిటిక్స్‌ను తారాస్థాయికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్రాప్‌లో పడి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారంటూ… కోటంరెడ్డిపై మంత్రి కాకాణి ఆరోపించారు. కాకాణి వ్యాఖ్యలకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి వద్దామనుకుంటే నమ్మక ద్రోహమా? అని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబానికి మీరు వీరవిధేయుడైతే వైఎస్‌ విగ్రహాన్ని పెట్టేందుకు ప్రయత్నిస్తే… ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతారని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కామెంట్‌ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. శ్రీధర్ రెడ్డి పెద్దగొంతు పెట్టుకొని మాట్లాడితే భయపడతామనుకుంటున్నారని అన్నారు. తన వద్ద ఫోన్ ట్యాపింగ్ ఆధారాలున్నాయని చెబుతున్న శ్రీధర్ రెడ్డి.. దానిపై కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేయాలని.. ఫోన్లు చేయించి భయపెట్టాలని చూస్తే మాత్రం సహించేది లేదన్నారు కోటంరెడ్డి. తన ద్వారా సజ్జల లబ్ది పొందలేదని ప్రమాణం చేస్తా.. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రమాణం చేస్తావా అంటూ.. కాకాణి ఛాలెంజ్‌ చేశారు

Read Also: Kotamreddy Sridhar Reddy: మొన్న ఆనం.. నేడు కోటంరెడ్డి.. షాకిచ్చిన వైసీపీ సర్కార్‌.

అయితే, వైసీపీలో కొనసాగడం ఇష్టంలేక మౌనంగా నిష్క్రమిస్తాం అని అనుకున్నా. కానీ, నా వ్యక్తిత్వాన్ని శంకించేలా మాట్లాడుతున్నారన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. అందుకే సమాధానం చెబుతున్నా. మా బావ కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా మాట్లాడాడు. బంధువునని.. మాట్లాడక పోతే బాగుండేదని అలా అంటున్నాడు. గతంలో నీకు వీర విధేయుడినే..ఇప్పుడు కాదు. నన్ను నమ్మక ద్రోహం అంటున్నావు. నిన్ను జెడ్.పి.చైర్మన్ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి ని ఎందుకు విభేదించావు. వై.ఎస్.కుటుంబం గురించి మాట్లాడే అర్హత లేదు. జగన్ ఓదార్పు యాత్ర అప్పుడు ఏమి చెప్పావు. కాంగ్రెస్ మహా సముద్రం.. జగన్ ఒక నీటి బొట్టు అన్నావు. జగన్ తో నడిస్తే ఎలాంటి భవిష్యత్ ఉండదని చెప్పావుగా. పొదలకూరులో వై.ఎస్.ఆర్.విగ్రహం.పెట్ట నేయకుండా అడ్డుకున్నావు. వై.సి.పి.ఎం.ఎల్.ఏ.గా వుంటూ చంద్రబాబు కాళ్లకు దండం పెట్టిందెవరు.. నువ్వు కాదా.. ఇది అందరికీ తెలుసు. మాట మాటకు సమాధానం ఇస్తానన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నకిలీ పత్రాల కేసులో జాగ్రత్తగా ఉండు. అన్ని వేళ్ళు నీ వైపు చూస్తున్నాయి. వై.సి.పి.లో మార్కులు కావాలంటే నన్ను తిట్టు. సజ్జల ను విమర్శిస్తే మా బావకు కోపం వచ్చింది. నేను ఎవరు ఫోన్ చేసినా ఎత్తుకుంటా. ఈ మధ్య కాలంలో ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి. ఇందులో 10 శాతం కాల్స్ బెదిరంపులే. నిన్న ఒక కాల్ వచ్చింది. బోరుగడ్డ అనిల్ అని ఫోన్ చేశాడు. నన్ను బెదిరించి.. కొట్టేసి తీసుకెళతానన్నావు. తీసుకెళ్లు చూద్దాం. నీ మాటలకు బెదరం. సజ్జలనే ఈ ఫోన్లు చేయిస్తున్నారు. నేను కూడా చేయిస్తాం.. వీడియో కాల్స్ వస్తాయి. నా మీద నిన్న కిడ్నాప్ కేసు పెట్టారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.