Political Heat in Nellore: నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో…పాలిటిక్స్‌ను తారాస్థాయికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్రాప్‌లో పడి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారంటూ… కోటంరెడ్డిపై మంత్రి కాకాణి ఆరోపించారు. కాకాణి వ్యాఖ్యలకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి వద్దామనుకుంటే నమ్మక ద్రోహమా? అని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబానికి మీరు వీరవిధేయుడైతే వైఎస్ విగ్రహాన్ని పెట్టేందుకు ప్రయత్నిస్తే… ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు.…