Site icon NTV Telugu

AP Govt: డ్రోన్ల సాయంతో గంజాయి సాగుకు చెక్..

Ap Govt

Ap Govt

AP Govt: గంజాయినీ అటవి మధ్యలో సాగు చేస్తే ఎవరూ గుర్తించలేరనుకుంటున్నారు. అంత దూరం వచ్చి చూసే వారెవరు అని భావిస్తున్నారు. వచ్చినా అడవిలో గంజాయినీ గుర్తించడం కష్టం అనుకుంటున్నారు. కానీ ఏపీ పోలీసులు ఈ గంజాయి సాగుదారులకు ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. డ్రోన్ల సాయంతో గంజాయి పెంపకం దారుల ఆట కట్టించాలని ప్లాన్ వేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డ్రోన్ల సాయంతో గంజాయి సాగుకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో 3. 55 ఎకరాల్లో డ్రోన్ల సాయంతో గంజాయి సాగును అధికారులు ధ్వంసం చేశారు. 3 అడుగుల ఎత్తు పెరిగిన గంజాయి మొక్కలను సైతం కనుగొనేలా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

Read Also: IPL 2025 GT: బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్‌గా పార్థివ్ పటేల్‌ను నియమించుకున్న గుజరాత్ టైటాన్స్

అలాగే, హై డెఫినీషన్ చిత్రాలను తీసే మల్టీ స్పెక్ట్రల్ కెమేరాలను డ్రోన్లతో అనుసంధానించే కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. గంజాయి మొక్కలను గుర్తించేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ).. గూగుల్ సహాయం తీసుకుని శాటిలైట్ తో హాట్ స్పాట్ ల ద్వారా గంజాయి సాగును గుర్తించనున్నారు. గంజాయి సాగును సమూలంగా ధ్వంసం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అని అధికారులు వెల్లడించారు.

Exit mobile version