తూర్పు గోదావరి జిల్లాలోని ధవలేశ్వరంలో కిడ్నాప్ కు గురైన ఇద్దరు బాలికల కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నాలుగు బృందాలతో కలిసి గాలిస్తున్నారు. ఒరిస్సా రాష్ట్రం బరంపురంకి చెందిన ఓ మహిళ తన భర్తతో విడిపోయి.. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో కలిసి గత 8 సంవత్సరాలుగా ధవళేశ్వరం గ్రామంలో నివాసం ఉంటుంది. ఆమె కుమార్తెలు మేడువలెం సరోజినీ, మేడువలెం పూర్ణిమలను మారోజు వెంకటేశ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు ఆరోపిస్తుంది.
Read Also: Jagdeep Dhankhar : రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌పై అభిశంసన తీర్మానానికి విపక్షాల సన్నాహాలు
మూడు నెలల క్రితం మారోజు వెంకటేష్ అనే వ్యక్తి రైల్వేలో టీసీగా పని చేస్తున్నాను అని చెప్పి వీరు ఉంటున్న ఇంటి పై పోర్షనులో అద్దెకు దిగాడు. ఈ సందర్భంగా తల్లికి రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని విజయవాడలో ఉంచి.. గత నెల 22వ తేదీన పిల్లలను హాస్టల్ తీసుకుని వెళ్లాడు.. ఆ తర్వాత కూడా విజయవాడ వెళ్లి బాలికల తల్లిని కలిసిన వెంకటేష్.. 28వ తేది నుంచి వెంకటేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో.. అనుమానం వచ్చి 29వ తేదీన ధవళేశ్వరం తిరిగి వచ్చిన తల్లి.. హాస్టల్ సిబ్బందితో మాట్లాడగా.. పిల్లలు హాస్టల్ కు చేరుకోలేదు అని చెప్పడంతో లబోదిబోమన్నాని రోధించింది ఆ తల్లి.. 30వ తేదిన ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Read Also: Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు నేడు ముగింపు.. భారత పతాకధారులుగా మను, శ్రీజేష్!
వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలికల మిస్సింగ్ విషయం తెలిసుకున్న జిల్లా ఎస్పీడీ నరసింహ కిషోర్ సీరియస్ అయ్యారు. దీంతో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్, విజయనగరంలలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, 22వ తేదీ తర్వాత రాజమహేంద్రవరంలో ఒక హోటల్లో ఒక రోజు ఆ తర్వాత నెల్లూరులో హోటల్లో ఒక రోజు బాలికలతో కలిసి మారోజు వెంకటేష్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.