Site icon NTV Telugu

Kanipakam: కాణిపాకంలో కలకలం.. భార్య కోరిక మేరకు మద్యం మానేయడానికి వచ్చి..!

Kanipakam

Kanipakam

ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో ఓ భక్తుడు కలకలం సృష్టించారు… తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి తన భార్య ఒత్తిడితో మొత్తానికి మందు మానేయలనే నిర్ణయానికి వచ్చాడు.. కాణిపాకంలో గణపతి సాక్షిగా మందు మానేయాలని భావించిన ఆయన.. ఇదే మందు తాగడం చివరి సారి అనుకున్నాడో ఏమో.. కానీ, ఫుల్ట్‌గా మందు కొట్టి వచ్చాడు.. దేవుడు దగ్గర మద్యం మానేయటం కోసం వచ్చిన ఆ భక్తుడు… భార్య కోరిక మేరకు మద్యం మానేస్తానంటూ ప్రమానం చేసేందుకు సిద్ధం అయ్యారు.. అప్పటికే ఫుల్ట్‌గా డ్రింక్‌ చేసి ఉన్న అతగాడు.. కోనేరిలో దిగాడు.. అయితే.. కోనేరులో దిగి స్నానం చేస్తూ.. నీటిలో మునిగాడు.. ఎంతకీ పైకి రాకపోవడంతో ఆందోళనకు గురైన బాధితుడి భార్య.. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.. రంగంలోని దిగిన సిబ్బంది, పోలీసులు.. రెస్క్యూ ఆపరేషన్‌ చేసి కోనేరులో మునిగిపోయిన భక్తుడికి బయటకు తీశారు.. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు.. మొత్తంగా ఈ వ్యవహారం కాణిపాకంలో కలకలం రేపింది.

Read Also: Naresh: మరో సీనియర్ హీరోయిన్ మోజులో నరేష్.. పవిత్రతో తెగదెంపులు..?

Exit mobile version