Site icon NTV Telugu

YS Jagan Bangarupalyam Visit: వైఎస్‌ జగన్‌ బంగారుపాళ్యం పర్యటన.. మరో కేసు నమోదు..

Ys Jagan

Ys Jagan

YS Jagan Bangarupalyam Visit: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై మరో కేసు నమోదైంది.. జగన్ పర్యటనపై ఇప్పటి దాకా మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి.. అనుమతి లేక పోయినా వైఎస్‌ జగన్ టూర్ లో రోడ్ షో చేపట్టారని కేసు నమోదు చేశారు పోలీసులు.. హెలిప్యాడ్ వద్దకు అనుమతి లేకుండా వందలాది మంది కార్యకర్తలను తీసుకొచ్చారని మరో కేసు పెట్టారు.. చిత్తూరు వైసీపీ సమన్వయ కర్త విజయానంద రెడ్డి తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.. ఇక, రోడ్డుపై మామిడికాయలు పోసి షరతులు అతిక్రమించారని.. మరో కేసు పెట్టారు.. పూతలపట్టు వైసీపీ సమన్వయకర్త సునీల్ తో పాటు 5 మంది పై కేసు నమోదైంది.. ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడి ఘటనపై మరో కేసు పెట్టారు.. ఇక, మొత్తం 4 కేసుల్లో సీసీ ఫుటేజ్‌, వీడియోలను పరిశీలిస్తున్నారు పోలీసులు.. మరికొంతమందిపై మరిన్నీ కేసులు నమోదు చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..

Read Also: The Paradise : ది ప్యారడైజ్‌కి డబుల్ ట్రీట్..

కాగా, బంగారుపాళ్యం మామడి మార్కెట్‌.. రైతుల పరామర్శకు వెళ్లేందుకు వైఎస్‌ జగన్‌ అనుమతి కోరగా.. ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు పోలీసులు.. అయితే, పోలీసుల ఆంక్షలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పట్టించుకోలేదని.. పెట్టిన నిబంధనలకు విరుద్ధంగా.. ర్యాలీలు, పెద్ద ఎత్తున సమీకరణ చేశారంటూ కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.. ఇప్పటికే 4 కేసులు నమోదు కాగా.. మరికొన్ని కేసులు కూడా పెట్టేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది..

Exit mobile version